'క్లాప్' కొట్టు గురూ!

దటీజ్..శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో 2008లో వచ్చిన ‘రాక్ ఆన్’ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనకు తెలియంది కాదు. ఆ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసి మంచి వసూళ్లు రాబట్టుకుంది. అంతేకాదు..విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు తాజాగా అదే చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ‘రాక్ ఆన్ 2’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం శరవేగంగా తెరకెక్కుతోంది. అది సరే..ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అదే అక్కడికే వద్దాం..ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్‌తో కలిసి శ్రద్దాకపూర్ నటిస్తోంది. తాజాగా బాగీతో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శ్రద్దాకపూర్ ఇందులో లీనమై జీవించేస్తుందిట. ఈ చిత్రంపై ఎంతో ధీమాను కూడా వ్యక్తం చేస్తుంది. తన కుటుంబ సభ్యులతో 2008లో వచ్చిన ‘రాక్ ఆన్’ చిత్రం తిలకించినప్పుడే ఇందులో నటిస్తే ఎంత బావుండేది అని అనుకుందట. తనకే కాదు, తన కుటుంబ సభ్యులకు కూడా అప్పటి ‘రాక్ ఆన్’ ఎంతగానో నచ్చేసిందట. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే ఎంత బావుంటుందో..అందులో తను నటిస్తే ఇంకెంత బావుంటుందో అని మనసులోనే అనుకుందట. ఇప్పుడు అదే ఈ విధంగా నిజమైంది. ‘రాక్ ఆన్-2’లో అవకాశం వచ్చినప్పుడు ఎగిరిగంతేసినంత పని చేసిందట. మరో విజయం కోసం ఎంతగానో తహ తహలాడుతోందిట. షుజత్ సద్గర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, ప్రాజీ దేశాయ్ నటిస్తున్నారు. ఈ చిత్రంతో కెరీర్ ఎక్కడికో వెళుతుందన్న ఆశలో శ్రద్దాకపూర్ వుంది. దటీజ్..శ్రద్ద!!

-సమీర్