'క్లాప్' కొట్టు గురూ!

యమజోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ వైపు అగ్రహీరోలతో చిత్రాలు.. మరోవైపు మరచిపోలేని పాత్రలు.. ఇలా వేటికవే సాటిగా కెరీర్‌లో ముందుకు పరుగులుతీస్తూ యమజోరుమీదుంది అందాల భామ, మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా. టాలీవుడ్, కోలీవుడ్‌లో ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన క్యారెక్టర్లు ఆమె కెరీర్‌కు ఎంతగానో ప్లస్ అయ్యాయి. కథానాయికగా మంచి ఫామ్‌లో వున్నప్పుడే ఐటమ్‌సాంగ్స్‌ని కూడా ఏ మాత్రం వదల్లేదు. ఇప్పటికీ అదే తరహా శైలి. అదే ఆసక్తి. తాజాగా ‘జాగ్వార్’ అనే చిత్రంలో ఐటమ్‌భామగా మరోసారి కనువిందు చేయబోతోంది. నిఖిల్‌కుమార్ కథానాయకుడుగా కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా అందాలు చూడతరమా!? అంటున్నారు సినీవర్గాలు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఫిలింసిటీలో ఈ ఐటమ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఐటమ్‌పాటే చిత్రానికి హైలెట్‌గా నిలువనుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. ఈ పాటలు తమన్నా మెరుపులు..ఆమె చిందించిన హావభావాలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయట. హీరోయిన్‌గా బిజీగా వుంటూనే ఇలాంటి తరహా ఐటమ్స్‌పై దృష్టిపెట్టడానికి కారణం అని ఈ బ్యూటీని కదిలిస్తే- ‘‘తప్పేముంది? ఏ..ఐటమ్ చేయకూడదని ఏమైనా రూల్ వుందా? బాలీవుడ్‌లో చూడండి ఇలాంటివి లెక్కేలేవు. మంచి అవకాశం అన్న ఫీలింగ్ మనకు కలిగితే చాలు.. చేయడానికి ఎప్పుడూ రెడీగా వుండాలన్నదే నా నియమం. నేను దీనిని కచ్చితంగా ఫాలోఅవుతాను’’ అంటూ చెప్పుకొచ్చింది. వాహ్..తమన్నా...రియల్లీగ్రేట్!!

-సమీర్