'క్లాప్' కొట్టు గురూ!

మంచి మార్పే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఎప్పుడూ పారితోషికాల గొడవే. హీరోలతో సమానంగా ఆడి పాడుతున్నా, తమకు రెమ్యూనరేషన్ విషయంలో సరైన న్యాయం జరగడంలేదని కథానాయికలు వాపోతుండటం సహజమే. ఇప్పుడు అలాంటి ఆలోచనకు తావులేనేలేదనే విషయాన్ని అందాల భామ సోనాక్షి సిన్హా కొట్టిపారేస్తుంది. అవును..నిజమే ఇది! ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి మంచి కథలు..ముఖ్యంగా కథానాయికలను బేస్ చేసుకొని వస్తున్న కథలు చాలానే వుంటున్నాయి. ఇది మంచి మార్పు. సోనాక్షి నటించిన ‘అకిరా’ తాజాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసింది. ఇందులో సోనాక్షి శ్రమకు తగ్గ ఫలితం కూడా లభించింది. అదే స్థాయిలో పారితోషికం కూడా. సోనాక్షి కూడా కథానాయికల ప్రాధాన్యతగల క్యారెక్టర్లపైనే మోజు పెంచుకుందట. అలాంటి చిత్రాలకే నా తొలి ప్రాధాన్యం అని కూడా చెబుతోంది. కరణ్‌జోహర్ నిర్మించనున్న తాజా చిత్రంలో సోనాక్షి ప్రాధాన్యం గల పాత్రనే చేస్తుందిట. 1969లో రాజేష్‌ఖన్నా, నందా నటించిన ‘ఇట్ట్ఫైఖ్’కు ఇది రీమేక్. వీటితో పాటు జాన్ అబ్రహంతో ‘్ఫర్స్-2’, అలాగే ‘నూర్’ అనే చిత్రాల్లో కూడా సోనాక్షి మెరుపులాంటి క్యారెక్టర్లనే చేస్తుందిట. ఈ విషయం గురించి సోనాక్షిని కదిలిస్తే- ‘‘అవును.. బాలీవుడ్ ఇప్పుడు అంతా కథానాయికల ప్రాధాన్యం గల చిత్రాలవైనకు మొగ్గు చూపుతోంది. మంచి కథలు వస్తున్నాయి. ఆయా పాత్రల్లో నటించిన కథానాయికలకు మంచి పారితోషికాలు కూడా లభిస్తున్నాయి’’అంటూ ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది. అదీ..సంగతీ!!

-సమీర్