'క్లాప్' కొట్టు గురూ!

అమ్మో..అమీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలతార అమీజాక్సన్ ప్రేమలో పడిందట. అదీ..బాలీవుడ్ హీరో సల్మాన్‌తోనట! అవునా..నిజమా? అని అనుకుంటున్నారా? అదే మరి నిజమేనట! ఇప్పటి వరకు సల్మాన్‌కు ఎంతో మంది హీరోయిన్లతో అఫైర్ వుందని వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ సల్మాన్ సోదరుడు సొహైల్ నటించిన ‘ఫ్రీకీ అలీ’లో నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా రజనీ ‘2.0’ ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమానికి ఎవరూ పిలవకుండానే సల్మాన్ హాజరుకావడంతో ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చినట్లయింది. అదీ కాకుండా అమీజాక్సన్, సల్మాన్ కలిసి ఓ చిత్రంలో నటించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏమో..ఏదైనా నిప్పులేందే పొగరాదుగా! అని అంటున్నారంతా. అమ్మో...అమీ!!

-సమీర్