బిజినెస్

చందా కొచ్చర్‌పై సీబీఐ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిబంధనలకు తిలోదకాలిచ్చి అక్రమ మార్గాల్లో బ్యాంకు రుణాలను మంజూరు చేసిన కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ దూత్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. చందా కొశ్చర్ చర్యల వల్ల ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.1730 కోట్ల నష్టం వాటిల్లినట్లు బ్యాంకు అధికారులు చెప్పారు. సీబీఐ ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత సీఈవో సందీప్ భక్షీ, ఇతర బ్యాంకు అధికారులు సంజయ్ చటర్జీ, జరీన్ దారువాలా, రాజీవ్ సబర్వాల్ కేవీ కామత్‌లను కూడా విచారించనుంది. ఈ రుణం మంజూరుకు సంబంధించి ఏర్పాటైన కమిటీల్లో వీరు కూడా సభ్యులుగా ఉన్నారు. బుధవారం కేసు నమోదు చేసిన సీబీఐ.. ముంబయి, ఔరంగాబాద్ తదితరచోట్ల కొచ్చర్ కుటుంబ సభ్యుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది. వీడియోకాన్ గ్రూపు కంపెనీలకు రూ.3250 కోట్ల విలువ చేసే రుణాలను అక్రమ మార్గాల్లో మంజూరు చేసినట్లు అభియోగం. ఈ కేసుల్లో వీడియోకాన్ ఎండీ దూత్ క్విడ్‌ప్రోకో విధానాలకు పాల్పడినట్లు కథనాలు వచ్చాయ.
ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు కమిటీల్లో సభ్యుల తీరుపై కూలంకషంగా దర్యాప్తు చేస్తామని సీబీఐ అధికార వర్గాలు వెల్లడించాయి.