గుంటూరు

శిథిలావస్థకు చేరిన రేపల్లె జూ.కళాశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపల్లె, సెప్టెంబర్ 27: వేలాది మంది విద్యార్థులు రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభిసించి అగ్రగాములుగా ఉన్న నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా కళాశాలలో నెలకొన్నాయి. 1932లో నిర్మించిన ఈకళాశాల నేటి వరకు విద్యార్థులతో కళకళలాడుతోంది. అయితే కళాశాలకు అనుబందంగా అదనపు తరగతి గదులు నిర్మించారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కళాశాలలోని అదనపు తరగతుల్లోని శ్లాబులు పెచ్చులూడి పడిపోయిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎటుచూసినా రెండు గజాల వెడల్పుల పెద్ద పెచ్చులూడి కిందపడిపోయాయి. గదిలో రాత్రి సమయం కాబట్టి విద్యార్థులు లేకపోవటంతో పెద్దప్రమాదం తప్పింది. పట్టణానికి చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం సజ్చా సత్యనాగలక్ష్మి కళాశాలలో చదువుతోంది. టేబుల్ కింద మరిచి పోయిన నోట్‌బుక్‌ను తీసుకునేందుకు మంగళవారం ఉదయం క్లాస్ రూమ్‌కు వెళ్ళగా ఆ సమయంలో శ్లామ్ పెచ్చులూడి చేతిపై పడటంతో వేళ్ళు, భుజానికి బలమైన గాయాలు అయ్యాయి. విద్యార్థిని కేకలు వేయటంతో దగ్గలో ఉన్న ప్రిన్సిపాల్ ప్రసన్నాంజనేయులు, అధ్యాపకులు క్లాస్ రూప్‌కు పరుగుపెట్టారు. అప్పటికే విద్యార్థిని ప్రమాదం తప్పించుకొని బయటపడింది. వెంటనే ప్రథమ వైద్యం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షలుచేసి ఎక్సెరేలు, మందులు అందజేశారు. విద్యార్థులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. దీనిపై సమగ్ర నివేదికను అధికారులకు పంపటం జరిగిందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇప్పటికే 86 సంవత్సరాలు గడవటంతో కళాశాలకు ఇంతవరకు మరమ్మతులు చేయలేదన్నారు. నాణ్యత ప్రమాణాలు ఇంజనీర్లు తేల్చాల్సిఉందన్నారు.