గుంటూరు

ముంపు బాధితులకు తక్షణమే పరిహారం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 27: భారీవర్షాలకు వాగులు పొంగిపొరలి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వరద ముంపునకు గురైన పొలాల రైతులకు తక్షణమే ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం అందజేయాలని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని జూపూడి, మునగోడు తదితర గ్రామాల్లో వరద ముంపునకు గురైన పంట పొలాలను కాంగ్రెస్‌పార్టీ నాయకులతో కలిసి పరిశీలించిన రఘువీరా రైతుల గోడును ఆలకించారు. ఒక్కసారిగా వరద ముంపు రావడానికి గల కారణాలను తెలుసుకున్నారు. వరదలో చిక్కుకుని ప్రాణాలు దక్కించుకున్న ఐదుగురికి ఒక్కొక్కరికీ 5 వేల చొప్పున కాంగ్రెస్ పక్షాన ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ పంటల బీమా పథకాన్ని అమలు చేసి తక్షణమే రైతులకు బీమా సొమ్ము అందేలా ప్రభుత్వం కృషిచేయాలన్నారు. మరలా పంటలు వేసుకునేందుకు విత్తనాలు సరఫరా చేయాలన్నారు. వివిధ బ్యాంకుల ద్వారా తక్షణమే రుణాలు కల్పించాలన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య మాట్లాడుతూ వ్యయ ప్రయాసలకోర్చి పండిస్తే చేతికందివచ్చిన పంటలు వరద ముంపునకు కొట్టుకుపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం మునగోడులో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు గడ్డం వెంకట్రావ్ కుటుంబాన్ని రఘువీరా, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి, సి రామచంద్రయ్య, పక్కాల సూరిబాబు పరామర్శించారు. పార్టీపరంగా 10 వేల రూపాయలు అందజేశారు. ఈ పర్యటనలో రాజ్యసభ మాజీ సభ్యులు జెడి శీలం, మాజీ ఎమ్మెల్యేలు షేక్ మస్తాన్‌వలి, యర్రం వెంకటేశ్వరరెడ్డి, డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వణుకూరి శ్రీనివాసరెడ్డి, కొరివి వినయ్‌కుమార్, ఊరబండి శ్రీకాంత్, వహిద్, ధనేకుల మురళీకృష్ణ, భవిరిశెట్టి హనుమంతరావు, బండ్ల పున్నారావు, లక్ష్మీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.