ఆటాపోటీ

వివాదాస్పద టోర్నీలో ఫిక్సింగ్ దోషి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలి, జైలు శిక్షను కూడా అనుభవించిన పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ అమీర్ ఒక వివాదాస్పద టోర్నీలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బిపిఎల్)లో రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అషఫ్రుల్, న్యూజిలాండ్ ఆటగాడు లవో వినె్సంట్, శ్రీలంక క్రికెటర్ కుషాయ్ లొకురాచి తదితరులపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. ఈటోర్నీలో పాల్గొన్న ఇంకా చాలా మంది ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొని ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) విజయవంతం కావడంతో, దాదాపు ప్రతి దేశంలోనూ ప్రీమియర్ లీగ్ టి-20 టోర్నీలు తెరపైకి వచ్చాయి. అయితే, వాటిలో ఏవీ ఐపిఎల్ మాదిరి విజయవంతం కాలేదు. బిపిఎల్ కూడా విఫలమైన టోర్నీల్లో ఒకటి. పైగా ఫిక్సింగ్ ఆరోపణలు టోర్నీని నిలువునా ముంచేశాయి. అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్న విమర్శలు ఎదుర్కొంటున్న టోర్నీలో స్పాట్ ఫిక్సింగ్ దోషికి అవకాశం లభించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అప్పటి కెప్టెన్ సల్మాన్ బట్, మరో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్‌తో కలిసి 2011లో ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లినప్పుడు అమీర్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. బుకీలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, తాను ఉద్దేశపూర్వకంగానే నోబాల్స్ వేశానని బ్రిటిష్ క్రౌన్ కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. ఫలితంగా జైలు శిక్షను కూడా ఎదుర్కొన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాలతో క్రికెట్ ప్రతిష్ట దెబ్బతింటున్నదని, నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా కృషి జరగకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు తప్పవని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర పలు సందర్భాల్లో హెచ్చరించాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేశారు. అయినప్పటికీ, బిపిఎల్‌లో చిట్టగాంగ్ వైకింగ్స్ జట్టులో అమీర్‌కు స్థానం దక్కింది. అతనిని వేలంలో ఆ ఫ్రాంచైజ్ ఎలా కొన్నదో, నిర్వాహకులు ఏ విధంగా అనుమతించారో ఎవరికీ అర్థం కావడం లేదని క్రికెట్ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికీ బిపిఎల్‌పై అనుమానాలున్నాయి. ఆ టోర్నీ ప్రజల నమ్మకాన్ని సంపాదించడానికి చాలా కాలమే పడుతుంది. ఈలోగా అమీర్ వంటి ఫిక్సింగ్ దోషులు వచ్చి చేరితే టోర్నమెంట్ ఏ స్థాయికి పతనమవుతుందో ఊహించడం కష్టం కాదు. కాగా, జైలు శిక్ష అనుభవించిన ఐదేళ్ల తర్వాత తొలిసారి విదేశంలో ఒక మ్యాచ్ ఆడిన 23 ఏళ్ల అమీర్ రంగ్‌పూర్ రైడర్స్‌పై 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఎంతటి సమర్థుడైనా నడవడికే సరిగ్గా లేకపోతే ఎవరూ ఆదరించరన్న విషయం అమీర్‌కు త్వరలోనే తెలుస్తుంది.