నిజామాబాద్

ఓటు హక్కు వజ్రాయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, ఫిబ్రవరి 8: ఎన్నికల ద్వారా సరైన నాయకున్ని ఎన్నుకోవడంలో ప్రజలే రాజులని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డికి వచ్చిన ఆయన కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరము ఆయన రాశీవనంలో కలెక్టర్, ఎస్పీలతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అక్కడి నుండి కలెక్టరేట్ కార్యాలయంలోని జనహిత భవన్‌లో జరిగిన ఎన్నికల ఓపేన్ ఫోరం ఎన్నికల అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ, ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వస్తాయి కాబట్టి ప్రజలు తమ ఓటుహక్కుతో సరైన నాయకున్ని ఎన్నుకోవడానికి తమ పేర్లను తప్పని సరిగా ఓటర్ జాబితాలో నమోదు చేసుకునేలా ప్రజలు, అధికారులు నిరంతారయంగా కృషి చేసి వందశాతం ఓటర్ల నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల వ్యవస్థకు సాంఘీక వ్యవస్థ పారిశ్రామిక వ్యవస్థ, టెలిఫోన్, బస్సులు, ఎన్నికల వ్యవస్థకు మూలం అని అన్నారు. ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారానే ప్రభుత్వం పనిచేస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి వ్యక్తిపై సంవత్సరానికి 30వేల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. తద్వారా ఐదు సంవత్సరాలకు 1లక్ష 50వేల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. కాబట్టి సరైన వ్యక్తులను ఎన్నుకోవడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతోందన్న విషయాన్ని ఎవ్వరూ మరిచిపోరాదని అన్నారు. ఎన్నికల సమయాన నాయకులు సమర్పించే ఆఫ్‌డవిట్‌లో వారి ఆస్తుల వివరాలను పరిశీలించాలని, నిజాయితీగల నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు. జిల్లాలో 55శాతం ఉన్న ఓటర్ నమోదును 70నుండి 80శాతానిక తీసుకురావడానికి గ్రామ అభివృద్ధి సంఘాల ద్వారా కృషి చేయాలన్నారు. పిఇఓ తెలంగాణ వెబ్‌సైట్ ద్వారా ఎవరైన తమ పేర్లను నమోదు మరియు సవరణలు, తమ పేర్లను పరిశీలించుకోవడం మార్చి 23వరకు చేసుకోవచ్చని అన్నారు. అనంతరము జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో మహిళ ఓటర్ల నమోదు అధికంగా ఉందని, జిల్లాలో ఓటర్ నమోదు అధిక సంఖ్యలో నమోదు అవుతోందని అన్నారు. కామారెడ్డిలో వెయ్యి మంది జనాభాకు 529మంది ఓటర్లు, ఎల్లారెడ్డిలో 569, జుక్కల్‌లో 565మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. జిల్లాలో 55శాతం ఓటర్ నమోదు హైదరాబాద్ కంటే కూడా అధికంగా ఉందన్నారు. జిల్లా 727పోలింగ్ స్టేషన్‌లకు బిఎల్‌ఓలను నియమించామని, వారు నిరంతరాయంగా ఫామ్-6 ద్వారాకొత్త ఓటర్ల నమోదు, ఫాం-7ద్వారా తొలగింపులు, అభ్యంతరాలు, పామ్-8ద్వారా సవరణలు, పాం-8ఎ ద్వారా నియోజక వర్గంలోని పోలింగ్ స్టేషన్‌ల మార్పులు చేపడ్తున్నామని వెల్లడించారు. స్పెషల్ క్యాంపెన్ ద్వారా ఫిబ్రవరి 4న కొత్తగా 3,197మంది ఓటర్లను నమోదు చేయడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 11న తరిగి స్పెషల్ క్యాంపెన్ నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరము జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఓటు విలువ చాలా కీలకమైందన్నారు. ఓటును వినియోగించుకోవడం ద్వారా సరైన పాలకులను ఎన్నుకోవచ్చని అన్నారు. ఓటు హక్కు వచ్చిన ప్రతి యువతి, యువకులు తమ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. మున్సిపాలిటీల్లో ఓటర్ నమోదు ఎక్కువ జరిగేలా చూడాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ అన్నారు. ఓపేన్ ఫోరంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఉస్మాన్ మాట్లాడుతూ, గతంలో ఓటర్లు పేర్లు లేక పోవడం వంటి కారణాల వల్ల ఓటు హక్కుకు చాలా మంది దూరం అయ్యారని ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. గాంధారి సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఓటరు అడ్రస్ ఆధార్ అడ్రస్‌లో సరిపోవడం లేదని, ఇండ్ల వారిగా జాబితా క్రమ పద్ధతిలో అలాట్ చేయబడటం లేదని అన్నారు. ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 9నుండి విద్యార్థులను ఓటర్‌లిస్టులో చేర్చడానిక ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ ఓపేన్ ఫోరం అవగాహన సదస్సులో డిఆర్‌ఓ మణిమాల, కామారెడ్డి ఆర్డీఓ శ్రీను, ఎల్లారెడ్డి ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, ఎంపిడివోలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల సర్పంచ్‌లు, ఎన్నికల సిబ్బంది వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.