ధర్మసందేహాలు

శకున శాస్త్రంలో నిజముందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అపశకునాలు ఎదురయినప్పుడు బయటకు వెళ్ళకూడదనే మాట సత్యమేనా?
- నల్లపాటి నరేంద్ర,
కొత్తగాజువాక
శకున శాస్తమ్రనే పేరుతో కొన్ని పుస్తకాలు లభిస్తున్నాయి. వాటి మూలమేమిటో సరిగా తెలియడం లేదు. ఆ పుస్తకాలలోనే మనోబలం తీవ్రంగా వున్నవారికి శకునాలు పనిచేయవని చెపుతున్నారు. కనుక మనోబలాన్ని పెంచుకునే ప్రయత్నం ఉత్తమం.
* ధర్మశాస్త్ర ప్రకారం వివాహ వయస్సెంత?
-రామయ్య , హైదరాబాదు
స: యువతీ యువకులకు కామసంబంధమైన ఆలోచనలను తీవ్రం కాకముందే, అనగా వన ప్రారంభంలోనే వివాహం జరగాలనేది ధర్మశాస్త్రాల సారం. సంపాదన దృష్టితో వివాహాలన ఆలస్యంగా చేసుకోవటం ధర్మశాస్త్రాలకు సమ్మతం కాదు.
* తథాస్తు దేవతంటే ఎవరు? - రోజా, యాదగిరి గుట్ట
వేదాలలో ‘‘అనుమతి’’అనే ఒక దేవత వుంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే ఆ దేవత వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో వుంది. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు- అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org