ధర్మసందేహాలు

కలియుగంలో సప్తఋషులు పేర్లేమి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యోగం ద్వారా మనిషి గాలిలోనికి లేవవచ్చునా?
- సందేహాలరావు, సూర్యాపేట
ఈ ప్రక్రియలు యోగశాస్త్రంలో ఉన్నాయని సుప్రసిద్ధమే. ఇటీవల కాలంలో మహర్షి మహేష్ యోగిగారి శిష్యులు గూడా వీటిని ఆచరించి చూపేవారని విన్నాము.
* పంచముఖ ఆంజనేయస్వామి ఉన్నాడా?
- కాట్రగడ్డ వెంకట్రావు, చెన్నై
ఆంజనేయ తత్త్వాన్ని విశేషంగా ఉపదేశించే గ్రంథాలలో పరాశర సంహిత ప్రముఖమైనది. దానిలో ఆంజనేయస్వామి యొక్క రకరకాల మూర్తులు వర్ణింపబడినాయి. వాటిల్లో పంచముఖ ఆంజనేయ రూపం ప్రధానమైనది. లంకలో బందీగా వున్న సీతాదేవికి ఆంజనేయస్వామి తన పంచముఖ స్వరూపాన్ని చూపించాడని గూడా ఈ గ్రంథంలో వున్నది.
* హోమం అంటే ఏమిటి?
- వి.వి.రావు, అమలాపురం
శాస్త్రోక్తమైన విధానంలో ఒక దేవతనుద్దేశించి శాస్త్ర విహితమైన హోమద్రవ్యాన్ని అగ్నిహోత్రంలో సమర్పించటమే హోమం.
* నర, నారాయణులు అంటే ఎవరు?
- నీరజ, హైదరాబాద్
స: హిరణ్యకశపుడ్ణి సంహరించిన తరువాత నరసింహావతార స్వరూపం కంఠం దగ్గర అడ్డంగా రెండు ముక్కలైంది. అందులో సింహం ఉన్న భాగం నారాయణుడు అనే మహర్షిగా మారింది. నర స్వరూపం ఉన్న భాగం నర మహర్షిగా మారింది. వారిద్దరిలోనూ విష్ణ్వంశ వున్నప్పటికీ నారాయణ మహర్షిలో ఆ అంశ మరింత అధికంగా ఉంది. వారిద్దరూ మిక్కిలి మిత్రులై తపస్సు చేసుకుంటూ ఆ తపస్సువల్ల దేవతలకు మేలు చేస్తూ వుంటారు.
*సప్త ఋషులు అంటే ఎవరు?
ఆర్. వెంకన్న, బెంగళూర్
ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క సప్తఋషుల గుంపు అధికారంలో ఉంటుంది. మానవులలో సద్భుద్ధులను, సత్కర్మలను ప్రోత్సహిస్తూ ఉండటం వీరి నిత్యకృత్యము. ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరంలో వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు అనేవారు సప్తఋషులు. ఇక మానవ శరీరంలో ముక్కు, చెవి, కన్ను, చర్మము, నాలుక, వాక్కు, మనస్సు అనే ఏడు సప్తఋషి స్థానీయాలని యోగ సంకేతము.
* జపము, ధ్యానము వీటికి గల తేడా ఏమిటి?
కశ్యప, చెన్నై
జపము అంటే మంత్రాక్షరముల యొక్క పునఃపునరావృత్తి మీద మనస్సును లగ్నం చేయటం. ధ్యానము అంటే తనకు ఇష్టమైన రూపం మీద గానీ, భావం మీద గానీ, తత్త్వంమీద గానీ మనస్సును కేంద్రీకరించి వుంచటం. జపాన్ని జాగ్రత్తతో సాధన చేస్తే అదే క్రమంగా ధ్యాన రూపంగా వికసించగలదు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి