బిజినెస్

గోఎయిర్ డిస్కౌంట్ ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 21: ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ గోఎయిర్.. శనివారం మూడు రాయితీ టిక్కెట్ల పథకాలను తీసుకొచ్చింది. క్రిస్మస్ స్పెషల్, గో ఎక్స్‌ప్లోర్, హ్యాప్పి ట్యూజ్‌డేస్ పేరిట పరిచయం చేసిన ఈ పథకాల ప్రయోజనాన్ని తమ కస్టమర్లు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య పొందుతారని గోఎయిర్ స్పష్టం చేసింది. అయితే క్రిస్మస్ స్పెషల్ పథకం ఈ ఏడాది వర్తిస్తుంది. ఈ నెల 20 నుంచి 22 మధ్య బుకింగ్స్ చేసుకున్నవారిలో ప్రతి 25వ ప్యాసింజర్.. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 25 వరకు ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకుంటాడంది.
ఇకపోతే గో ఎక్స్‌ప్లోన్ పథకానికి ఈ నెల 21 నుంచి 24 మధ్య టిక్కెట్లు బుకింగ్ చేసుకోవాలని, హ్యాప్పి ట్యూజ్‌డేస్‌కు ఈ నెల 24 నుంచి డిసెంబర్ 15 వరకు బుకింగ్స్ చేసుకోవచ్చని చెప్పింది. మొత్తం నాలుగు వారాలపాటు ఈ మూడు పథకాల బుకింగ్స్ ఉంటాయని డిసెంబర్ 14 అర్ధరాత్రి బుకింగ్స్ ముగిసిపోతాయని గోఎయిర్ పేర్కొంది. 691 రూపాయల ప్రారంభ ధరతో ఈ టిక్కెట్లు మొదలవుతాయని, పన్నులు అదనమని, ఈ టిక్కెట్ కేవలం వన్‌వే ప్రయాణానికే పరిమితమని చెప్పింది.