రచ్చ బండ

తెలంగాణలో రెక్కలూడిన ‘ఫ్యాను’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘్ఫ్యను’ తెలంగాణలో నిలిచిపోయింది. ‘్ఫ్యను’కు ఉన్న రెక్కలూడాయి. తెలంగాణలో ప్యానుకు విద్యుత్తు నిలిచిపోయింది. చట్ట సభలకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలంగాణలో కొనఊపిరితో ఉన్న ఆ పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడింది. తెలంగాణలో ఫ్యానుకు రెక్కలూడి, విద్యుత్తు నిలిచిపోయినందున నామమాత్రంగా ఉంటుంది.
2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు (పినపాక), మదన్‌లాల్ (వైరా), తాటి వెంకటేశ్వర్లు గెలుపొందారు. వీరిలో ఇప్పటికే మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) కారెక్కేయగా.. మిగిలి ఉన్న ఖమ్మం వైకాపా లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (పినపాక) కూడా బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
వైకాపా అధ్యక్షుడు, ఎపిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఇంత కాలంగా చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆయన్ను తెలంగాణ పార్టీ శాఖకు అధ్యక్షునిగా కూడా నియమించారు. రాబోయే ఎన్నికల నాటికి తన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారధ్యంలోనే తెలంగాణలో పార్టీని ముందుకు నడిపించాలనుకున్నారు. రెండేళ్ళుగా పొంగులేటి కూడా నమ్మిన వ్యక్తిగానే ఉన్నారు. పొంగులేటిగానీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ ఫిరాయించరని జగన్ విశ్వసించారు. వైఎస్ జగన్ తన సోదరి షర్మిలతో తెలంగాణలో పరామర్శ యాత్రలు, రైతు భరోసా యాత్రలు, పాదయాత్రలు చేయించినప్పుడు పొంగులేటి ఆమెకు అండగా నిలిచి ఏర్పాట్లు బాగా చూసుకున్నారు. పొంగులేటిపై విశ్వాసంతో ఉన్న జగన్ తెలంగాణలో పార్టీ పటిష్టత వైపు దృష్టి సారించలేదు. మరోవైపు జగన్‌కు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండటం, ఆంధ్రలో పార్టీ బలపడి 2019లో జరగబోయే ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉండడం వల్ల తెలంగాణలో పార్టీపై దృష్టి పెట్టలేదు. అయితే తెలంగాణలో పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తే, ఆంధ్రలో పార్టీ దెబ్బతింటుందని ఆయన భావించారేమో. తెలంగాణలో పార్టీ బలోపేతానికి సోదరి షర్మిలతో కొన్ని కార్యక్రమాలు చేయించారు. కానీ షర్మిల లోగడ పాదయాత్ర చేపట్టి ఆమె ఎడమ మోకాలు కొంత అరిగిపోవడంతో అపొలో ఆసుపత్రి డాక్టర్లు శస్త్ర చికిత్స చేశారు. అనంతరం ఆమె తప్పని సరి పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమైందో కానీ ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. షర్మిల పూర్తిగా కోలుకున్నా, మునుపటిలా ఆమె తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయించకపోవడానికి గల కారణాలు ఏమిటో పార్టీలో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
తాజాగా ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం పార్టీలో చేరడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం చోటు చేసుకున్నది. కనీసం ఒక ఎంపి, ఒక ఎమ్మెల్యే అయినా పార్టీకి ఉన్నట్లయితే తెలంగాణలో కార్యకర్తలకు మనోధైర్యం ఉండేది. ప్రజా సమస్యలపై చట్ట సభల్లో పార్టీ వాణి వినిపించేందుకు అవకాశం ఉండేది. అంతేకాకుండా కార్యకర్తలకు ప్రభుత్వ పరంగా ఏవైనా పనులు ఉంటే ఎంపీ, ఎమ్మెల్యే వద్దకు వెళ్ళేందుకు అవకాశం ఉండేది.
వైకాపాకు తెలంగాణలో ప్రజాప్రతినిధులు లేకపోయినా పార్టీ యంత్రాంగం మాత్రం తెలంగాణలో ఉం టుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయించడంతో ఆయన స్థానంలో మరో నాయకుడిని అధ్యక్షునిగా నియమించాల్సి ఉంది. 2014లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, డజను మంది టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ టిఆర్‌ఎస్ శాసనసభాపక్షంలో రెండింట మూడో వంతు మందికి పైగా టిఆర్‌ఎస్‌లో చేరినందున ఆ పార్టీ శాసనసభాపక్షంలోని చీలిక విభాగాన్ని విలీనంగా స్పీకర్ గుర్తించారు. స్పీకర్ ఆదేశం మేరకు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ రాజా సదారామ్ బులిటెన్ విడుదల చేశారు. తెలంగాణలో వైకాపా నుంచి ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్యేలు (వంద శాతం) టిఆర్‌ఎస్‌లో చేరినందున ఆ పార్టీ శాసనసభాపక్షం కూడా టిఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు బులిటెన్ విడుదల చేస్తారేమో!
తెలంగాణ నుంచి చట్ట సభలో వైకాపా అడ్రసు గల్లంతు కావడంతో కార్యకర్తలు దిగాలుపడ్డారు. పోనీ ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ బలంగా ఉందా? అంటే అక్కడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలో చేరేందుకు ‘క్యూ’ కట్టారు. ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి ‘జంప్’ అయ్యారు. ముఖ్యంగా వైకాపా శాసనసభాపక్షం ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ, జగన్‌కు సమీప బంధువు అయిన భూమా నాగిరెడ్డి, భూమా కుమార్తె అఖిల ప్రియ కూడా ‘సైకిల్’ ఎక్కడం పార్టీ నేతలను ఆశ్చర్య పరిచింది. పార్టీ ఇలా ‘్ఢ’లా పడడానికి కారణం ఏమిటీ? ఎక్కడ లోపం ఉంది? అని జగన్ అంతర్మథనం చేసుకోకపోవడం, పార్టీలో చర్చించకపోవడం, సమీక్షించుకోకపోవడమే కారణం. జగన్‌కు అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ, బాసటగా నిలిచిన సీనియర్ నాయకుడు, మాజీ హోం మంత్రి ఎంవి మైసూరారెడ్డి గత వారం ఘాటైన లేఖ రాస్తూ పార్టీకి గుడ్-బై చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నాయకులు వైకాపాలో ఇమడలేక బయటకు వెళుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించి, జగన్ పార్టీలో అందరినీ విశ్వసించి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. జగన్ మారాలి అని పార్టీ నేతల భావన.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి