మంచి మాట

భక్తి తత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపికలను ధన్యజీవులంటారు. ఎందుకంటే వారు భక్తాగ్రేసరులు. కేవలం శ్రీకృష్ణుని మీద ఉన్న ప్రేమతోనే భక్తి సామ్రాజ్యంలో ఉన్నత స్థానంలోకి వెళ్లారు. గోవింద చరణ లగ్న మానసలయిన గోపికలు జీవిత పరమార్థమును సాధించారు. శ్రీకృష్ణుని పట్టమహిషుల భక్తి చింతామణితో సమానమయితే గోపికల భక్తి అంతకుమించిన కౌస్త్భుమణితో సమానమంటారు పెద్దలు. గోపికల భక్తి ఆకాశము కంటె ఎత్తు, సముద్రముకంటే లోతు, అగ్నికంటె ఉజ్జ్వలము, వాయువుకంటె వేగవంతము అయినది. వారు తమ శ్రీకృష్ణుని ఏ చింతలేకుండా ఉండాలని కోరుకుంటారు.. సామాన్యులవలె వారి కోరికలను ఏకరువు పెట్టరు. పైగా వారిదగ్గరున్న పాలుపెరుగు వెన్నలను మధురాధిపతికి మధురంగా నివేదన చేస్తుంటారు.
అందుకే ఎవరైనా భక్తి సామ్రాజ్యంలోకి అడుగిడుదామనుకొంటే వారుముందుగా ప్రహ్లాద నారద పరాశరుల్లాంటి మహర్షులాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటారు. కాని వారికన్నాముందుగా ఈ గోపికలను తీసుకొన్నట్టయతే సంసారబాధ్యతలు మోస్తూనే సంసార సాగరంలో ఉంటూనే గోపీమానసచోరుని చిత్తాన్ని ఆకర్షించవచ్చు నని అంటారు. వారు యశోదాతనయుని ఆగడాలను భరించలేమంటూనే వారి మనసుల్లో ఆ నందనందునికే పెద్ద పీట వేసారు. ఆ పీటలో మరొకరు కూర్చోవడానికి సాహసించ వీల్లేకుండా మంచి గట్టిగోడను నిర్మించారు. అట్లానే సామాన్యులు కూడా రుక్మిణీపతిని, సత్యావిధేయుణ్ణి మనసారా ప్రేమించాలి. ఆయన లీలను స్మరించాలి. పూతనాదులు మట్టుపెట్టిన విధాన్ని ఎరుకపర్చుకోవాలి. అర్జునాదులకు చేసిన బోధను అవగాహన చేసుకోవాలి. ఇంకేమి గీతచార్యుని మాటకుకట్టుబడితేచాలు ఇటు ఈలోకంలోనూ నీతిగాను ధర్మంగాను బతకవచ్చు. పరలోకానికి బోలెడంత పుణ్యాన్ని ఆర్జించుకోనూ వచ్చు.
గజేంద్రునిలాగా సంశయాన్ని సందేహాన్ని వెలిబుచ్చనక్కర్లేదు. అసలు దేవుడున్నాడో లేడో అన్న సంశయాస్పద మానసుడై వికల్పమనస్కుడు కానవసరం లేదు.
ఉన్నాడు ఉన్నాడు అంతటా సర్వాంతర్యామి ఉన్నాడు. ఎందెందు వెతికి చూసినా అందందే ఉన్నాడు అంటూ సహస్రాక్షుడిని, సహస్రపాదుణ్ణి, అనంతనామధేయుణ్ణి నిరాకారుణ్ణి నిర్విచారుణ్ణి ఈ చర్మచక్షువులతోనే చూడవచ్చు. అందుకే కార్తికంలో రమ్యమైన విష్ణుకథలను వింటారు భక్తజనం. ద్వాదశి నాడు బృందావన విహారి యైన మహావిష్ణువు ను చూచి దామోదరుణ్ణి స్మరించుకుంటారు.
అలనాడు యశోదమ్మలో భక్తి ఎంత ఉన్నదో చూడాలనుకున్న చిన్న కృష్ణుడు రోటికి కట్టబడ్డాడు. ఆ రోటి కట్టడానికి యశోదమ్మను నానాయాతనలకు గురిచేసాడు. ఆ యమ్మ వగరుస్తూ వోడుతూ ఆడుతూ చిన్నికృష్ణునికోసం పరుగెత్తతుంటే ఆహా ననే్న పట్టుకుంటావా అని అంటూనే యశోదమ్మకు పట్టుపడినాడు. ఆ నవనీతచోరుడే మన్ను తిన్నావా అని అడిగి నోరు తెరవమంటే ఆ నోటిలో 14్భవనాలను చూపించి యశోదమ్మను అవాక్క య్యేలా చేశాడు. ఆ పరమాత్మనే దుర్యోదనాదులకు చిత్రవిచిత్రంగా కనిపించాడు. కుచేలుడి వంటి సహృదయులకు స్నేహధర్మంతో పరిచయం అయ్యాడు. అర్జునా దులకు బంధువు యైనా గురువుగాను, సఖుడిగాను వారి వెన్నంటి ఉన్నాడు.
ఆ పరమాత్మనే అచంచలమైన భక్తితో ఎవరు కొలుస్తారో, ఎవరు స్మరిస్తారో వారిని క్షణమైనా వీడకుండా వారిని నీడగా ఉంటూ వారు అడకపోయనా వారి యోగక్షేమాలను చూస్తానని గీతలో ఘంటాపధంగా చెప్పాడు. అందుకే నేడు ఆధునిక యుగమైనా సరే అపరరాజనీతిజ్ఞుడైన శ్రీకృష్ణుని రాజనీతి నే ఆదర్శంగా తీసుకొంటున్నారు. వ్యక్తిత్వ వికాసానికి ఆ శ్రీకృష్ణుడు నేర్పిన పాఠాలనే నెమరువేసుకొంటున్నారు. నిరంతరం హరే రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే అని జపిస్తుండమంటారు, చేయంచేవాడు, చేసేవాడు చేసే పని కూడా పరమాత్మనే అనుకొంటే చాలు భక్తితత్వం అవగాహనకు వస్తుంది.

- రాంప్రసాద్