ఈ వారం కథ

ఆచారాలతో సంస్కారాల మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** కనీసం ఈమధ్య పిల్లలు పెద్ద వారు కనిపిస్తే నమస్కారం చేయడం లేదు హాయ్ అని చేతులూపుతున్నారు. ఆశీర్వచనానికి ఉన్న బలం తెలుసుకొంటే నన్నా వారు పెద్దవారికి నమస్కారం చేస్తారు. ముందుగా తల్లిదండ్రులు కూడా పెద్దవారిని ఇంటికి ఆహ్వానించడం, గురువుల్లాంటి వారు వస్తే వెళ్లి చూడడం లాంటివి అప్పుడప్పుడైనా చేస్తుంటే పిల్లలు నేర్చుకుంటారు. భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్థులను విద్యాప్రాప్తిరస్తు అని, పెళ్ళైన ఆడవారిని దీర్ఘసుమంగళీభవ అని, పురుషులను దీర్ఘాయుష్మాన్‌భవ అని.. ఇలా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు. యజ్ఞయాగాదులు చేసేటపుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాల్లో పండితులు సమాజంలో అందరిశ్రేయస్సు కోరుతూ... ఆశీర్వచనము చేస్తారు.

ఎక్కడ చూసినా న్లూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. కొన్నాళ్ల క్రితం చింతలు లేని కుటుంబం చిన్న కుటుంబం అని అన్నారు కాని నేడు అది సదాచారాలను, సంప్రదాయాలను మరిచిపోయేట్లు చేస్తోంది. తల్లి దండ్రి ఇద్దరూ పొద్దునే్న ఉద్యోగాలకు పోతూ హాడావుడిగా పనులు చేసేసి పరుగెత్తిపోతున్నారు. అపుడు స్కూల్స్ కి వెళ్లే పిల్లలను తయారు చేయడంలోనే జాగ్రత్తలు చూపిస్తారు. కాని మన ఆచారాలను, సంప్రదాయాలను వారికి నూరిపోసేంత లేకుంటే వారు ఇంట్లో చేసేవి చూసేంత టైమ్ వారికి ఇవ్వడంలేదు. దీనివల్ల కూడా మన ఆచారాలు కనిపించకుండా పోతున్నాయి. కనీసం ఈమధ్య పిల్లలు పెద్ద వారు కనిపిస్తే నమస్కారం చేయడం లేదు హాయ్ అని చేతులూపుతున్నారు. ఆశీర్వచనానికి ఉన్న బలం తెలుసుకొంటే నన్నా వారు పెద్దవారికి నమస్కారం చేస్తారు. ముందుగా తల్లిదండ్రులు కూడా పెద్దవారిని ఇంటికి ఆహ్వానించడం, గురువుల్లాంటి వారు వస్తే వెళ్లి చూడడం లాంటివి అప్పుడప్పుడైనా చేస్తుంటే పిల్లలు నేర్చుకుంటారు. భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్థులను విద్యాప్రాప్తిరస్తు అని, పెళ్ళైన ఆడవారిని దీర్ఘసుమంగళీభవ అని, పురుషులను దీర్ఘాయుష్మాన్‌భవ అని.. ఇలా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు. యజ్ఞయాగాదులు చేసేటపుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాల్లో పండితులు సమాజంలో అందరిశ్రేయస్సు కోరుతూ... ఆశీర్వచనము చేస్తారు. సిద్ధులు, గురువులు, యోగులు, వేదపండితులు మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకు నమస్కరించి ఆశీర్వచనం తీస్కోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకు కాదు. వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి.
మార్కండేయుడు అల్పాయుష్కుడుగా పుడతాడు. కాని ఆయన చిన్నప్పటి నుంచి సదాచార సంపన్నుడుగా మారుతాడు. పెద్దలందరి దగ్గర దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వచనాలను పొందేవాడు. ఆ ఆశీర్వచన బలం వల్లనే మార్కండేయుడు నేటికి చిరంజీవిగా మారాడు. కనుక పిల్లలైనా పెద్దలైనా పెద్దవారిని గౌరవించండి. వారి మనసుకు తగ్గట్టు మసలుకోండి. వారి పట్ల మీరు చూపే ఆదరణే వారు మనకు ఇచ్చే ఆశీర్వచనాకి బలం చేకూరుతుంది.

- కురవ శ్రీనివాసులు