ఈ వారం కథ
పార్టీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అనుకున్నవన్నీ అనుకున్నట్లు సాగితే అది జీవితం కాదు - రామారావు
నిజమే కానీ , మరీ ఇంత మంకు పట్టు పట్టి ప్రవర్తిస్తే నేం చేయాలో నాకు అర్థం కావడం లేదు - సీతాపతి
ఒకపని చేద్దాం - రామారావు
ఏం పని?- సీతాపతి
అసలు నీ సమస్య నాకు రెండు ముక్కల్లో చెప్పు- రామారావు
ఆఁ...మేము ఉండే చుట్టుపక్కల వాళ్లు ధనవంతులు. వారిపిల్లలు వారి హోదాకు తగ్గట్టు బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకొంటున్నారు. అవి చూసి మాకు అలాగే ఉండాలి అంటారు మా పిల్లలు. ఒక్క బర్త్‌డే కాదు ప్రతి పండుగ లేక ఏదైనా ఓ ముఖ్యమైన రోజు ఇలా చేస్తారు. అప్పుడల్లా మా పిల్లలు గోల చేస్తున్నారు. వారు ధనవంతుల పిల్లల్లాగా చేయడానికి నాదగ్గర డబ్బు లేదు. పైగా వారు రిటన్ గిఫ్ట్స్ అట గొప్పగొప్పవి ఇస్తున్నారు. ఇపుడు మా పిల్లవాడి బర్త్‌డే వస్తోంది. అప్పుడు గొప్ప పార్టీ నేను ఇవ్వాలని చెబుతున్నాడు..- సీతాపతి
ఓస్ ఇంతేకదా.. నేను మీ ఇంటికి వస్తాను.. మీ అబ్బాయి సంతోషించేలా పార్టీ అరేంజ్ చేస్తాను. సరేనా.. రామారావు
అదేలా... సీతాపతి
ముందు నన్ను ఈరోజే మీ ఇంటికి తీసుకెళ్లి మీ అబ్బాయికి నన్ను పరిచయం చేయి... రామారావు
***
అనుకొన్నట్టుగానే బర్త్‌డే వచ్చేసింది. సీతాపతి మనసులో దిగులు ఎక్కువైంది. అప్పటికీ మంచి బట్టలు కొన్నాడు. మంచి మంచి చాక్లెట్స్ కొన్నాడు. కానీ... రామారావుతో మాట్లాడిన తరువాత నుంచి అజయ్ బర్త్‌డే గురించి ఏమీ మాట్లాడడం లేదు.. ఈరోజు పొద్దునే్న రామారావు వచ్చి అజయ్ ను తీసుకెళ్లాడు... ఇప్పటి దాకా రాలేదు.. ఏమి చేస్తాడో ఏంటో అని ఒకటే దిగులు పడుతున్నాడు సీతాపతి.
అంతలో చాలామంది పిల్లలు మంచిమంచి డ్రస్సులు వేసుకొని వచ్చారు. వారంతా ‘‘అంకుల్ అజయ్ ఎక్కడ? మేము గ్రీటింగ్స్ చెప్పాలి’’ అన్నారు.
దానితో మరింత దిగులు ఎక్కువైంది సీతాపతికి. అమ్మో వీరిని లెక్కవేస్తే సుమారు 40 మంది దాకా ఉన్నట్టున్నారే.. ఇన్ని చాక్లెట్స్ కావాలి గదా అని ఇంట్లోకి బయటకు తిరుగుతున్నాడు...
మధ్యమధ్యలో పిల్లలు ఏదో అడుగుతున్నారు.. వారికేదో ఒకటి సమాధానాలు ఇస్తున్నాడు..కాని మనసులో ఆందోళన ఎక్కువైంది..
అంతలో ఆటో ఆగింది.
పిల్లలంతా అదిగో అజయ్ అంటూ పరుగెత్తారు. వాడు నేను తెచ్చిన కొత్తడ్రసు వేసుకొని ఎంతో ఆనందంగా పిల్లలు చెప్పే విషెష్‌స్ స్వీకరిస్తూ రండి రండి అంటూ వారినంత ఇంట్లోకి తీసుకొని వచ్చాడు...
బిలబిలమంటూ పిల్లలు వచ్చారు. ఎంతకీ రామారావు కనిపించకపోయేసరికి
‘‘అజయ్ అంకుల్ నీ దగ్గరకు వచ్చాడు కదా... మరి వాడేడి?’
అంతలో ‘ఇక్కడే ఉన్నాను లేరా... సీతాపతి కంగారు పడకు ’ అని పక్కటి రూమ్‌లోంచి రామారావు సమాధానం వినపడింది.
సీతాపతికి మరింత ఆశ్చర్యం వేసింది.
అంతలో పిల్లలంతా కూర్చున్నారు. వారికి సీతాపతి భార్య సీతమ్మ వడలు, పల్లీ ఉండలు ప్లేటులో పెట్టి తెచ్చి ఇచ్చింది. వారంతా వాటిని ఎంతో బాగున్నాయని తిన్నారు. ఆ తరువాత వారు తెచ్చిన గిఫ్ట్స్ అజయ్ కి ఇచ్చారు. కేక్ కట్ చేయవా అని ఒకరు అడిగారు.
అజయ్ లేదురా కొత్తగా నా బర్త్‌డే చేద్దామనుకొంటున్నాను.. అంటూ మీరంతా లైనుగా కూర్చోండి అని పిల్లల్ని వరుసగా కూర్చోబెట్టారు. సీతాపతి ఉన్న రూమ్‌లోకి అజయ్ కూడా వెళ్లాడు. వస్తూ వస్తూ ఎర్రని గులాబీలున్న చిన్న చెట్టును చేతుల్లో పట్టుకొచ్చి వాని ఫ్రెండ్‌కిచ్చాడు. ‘‘ఇదిగోరా ఇది నా రిటన్ గిఫ్ట్... మన చాచాజీ నెహ్రూకి గులాబీలు, పిల్లలు అంటే ఇష్టం కదా. అందుకే మనమంతా మంచి గులాబీ తోటను పెంచుకుందాం. దానికోసమే నేను మీకు ఒక్కో గులాబీ మొక్కను ఇస్తాను. మీరు దానిని పెంచుతూ మరిన్ని మొక్కలు పెంచండి. ఇప్పటినుంచి ఏ పార్టీకైనా గులాబీ మొక్కలను పంచుకుందాం. ఏమంటారు?’ అన్నాడు.
పిల్లలంతా చప్పట్లు కొట్టారు. వెరీ నైస్ బాగుంది బాగుంది. నేను నా బర్త్‌డే పార్టీకి గులాబీ మొక్కను ఇస్తాను అని అందరూ అన్నారు.
రామారావు, సీతమ్మ గులాబీ మొక్కలను అందిస్తూ ఉంటే అజయ్ అందరికీ గులాబీ మొక్కలను ఇచ్చాడు. వారంతా వండర్‌వుల్ అంటూ గ్రీటింగ్స్ చ చెప్పి వెళ్తున్నారు.
అజయ్ కళ్లల్లో ఆనందం నాకు ముచ్చటేసింది.
అంతలో అందరూ వెళ్లిపోయారు.. సీతాపతి నా దగ్గరకు వచ్చాడు.. ఎలా ఉంది మీ అబ్బాయి పార్టీ ... అన్నాడు. అంతలో అజయ్ పరుగెత్తుకు వచ్చి నాన్నా సీతాపతి మామయ్యతో ఇట్లా నా బర్త్‌డే పార్టీ ఇలా చేయమని చెప్పావా.. నాకెంతో నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను మెచ్చుకున్నారు... అంటూ నా బుగ్గ మీద చిన్ని ముద్దు ప్రెంజట్‌చేశాడు.
నేను రెండు చేతులతో వాడ్ని తీసుకొని ముద్దాడాను..
నేను సీతాపతికి కళ్లతోనే నా అభినందనలు తెలిపాను.
సీతాపతి చిన్న చిరునవ్వు నవ్వాడు. నేను నా కళ్లల్లో నీరు ఊరుతుండగా సీతాపతికి షేక్‌హ్యాండ్ ఇచ్చాను...