ఈ వారం కథ

స్నేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంతి ఒకటే ఆలోచిస్తోంది. ఎంతకీ ఏమి చేయాలో తోచడం లేదు. అంతలో
‘పేరుకే ప్రశాంతి నిజానికి ఎప్పుడూ ఆలోచనా స్రవంతిలోనే మునిగిపోయి ఉంటావు’ విశ్వాస్
‘ఆఁ మీరు మాత్రం విశ్వాస్ అని పెట్టుకున్నారు. కదా మిమ్మల్ని పూర్తిగా నమ్మవచ్చా. విశ్వాసం చూపిస్తారా’ ఉక్రోషంతో అంది ప్రశాంతి.
‘్భషుగ్గా.. నాపై విశ్వాసం ఉన్నవాళ్లకు ఎన్నడూ నేను కీడు చేయను’ విశ్వాస్.
‘సరే కానీ ఇంతకీ ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఇంటి పైకప్పుకు ఏ రేకులు వేద్దామనా లేక ఇంటి లోపల టైల్స్ ఏమి వేద్దామనా’ హస్కీగా అడిగాడు విశ్వాస్.
‘మీకు ఎప్పుడూ నన్ను ఆటపట్టించడమే . అసలు సమస్య ఏంటో ఏమిటో అని ఎప్పుడైనా పట్టించుకున్నారా’ ప్రశాంతి.
‘సమస్య ఏంటో చెబితే పరిష్కారం చూపిస్తాం’ విశ్వాస్
‘అదే ఆ రామ్ ఉన్నాడు కదా. మన ఎదురింటి శ్యామల కొడుకు వాడు మనవాడిని ఆటల్లో ఎగతాళి చేసాడట. పైగా బాల్‌తో ఆడుతూ దెబ్బ తగిలేట్టుగా బాల్‌ను విసిరేశాడట. చూశారా. పైగా నువ్వు చదువులో లాస్ట్‌లో ఉన్నావు ఆటల్లో నూ లాస్ట్‌లో నే ఉంటావా ’అని అన్నాడట. మన శ్యామ్ రామ్ కన్నా పదిమార్కుల తక్కువ తెచ్చుకున్నాడు కదా. అందుకే వాడు అట్లా అన్నాడని వీడు ఒకటే బాధపడ్డాడు. పైగా ఆ ఎగ్జామ్స్ రాసేటపుడు మనవాడికి జ్వరం వచ్చింది కదా. అందుకే అపుడు మార్కులు తగ్గి ఉంటాయి. అయినా వాడు మనవాడిని బాల్‌తో కొట్టడం ఏమిటి మరీ రామ్‌కు బాగా పొగరెక్కింది. శ్యామలనే ఎదో చెప్పి ఉంటుంది. అందుకే మనవాడిని రామ్‌తో ఆడద్దు దీనికి పరిష్కారం నేను చూపిస్తాను అని మన శ్యామ్ తో చెప్పాను.’ ఆగకుండా తన మనసులో ఉన్నదంతా వెళ్లగక్కింది.
‘ఇపుడు చెప్పండి. నేను వాళ్ల అమ్మకు వాడికి ఎలా బుద్ధి చెప్పడమా అని ఆలోచిస్తుంటే మీరేమో నామీద కుళ్లు జోక్స్ వేస్తారా’ కోపంగా అంది ప్రశాంతి.
అంతలో రామ్ శ్యామ్ ఇద్దరూ వీరింటిలోకి వచ్చారు. ఒకరి పుస్తకాలు ఒకరు తీసుకొన్నారు.
‘శ్యామ్ నీకు ఆ మేథ్స్ నేను ఈవినింగ్ ఎక్స్‌ప్లేయిన్ చేస్తాను. అంతలో నీవు సైన్సు కంప్లీట్ చేసేయ్ ’అన్నాడు రామ్
‘ఒకే నీకు నేను రేపు సైన్సు లో డౌట్స్ క్లియర్ చేస్తాను. అప్పటికీ నా వర్క్ పూర్తి అవుతుంది’అన్నాడు శ్యామ్.
‘సరే బాయ్... ’అంటూ రామ్ వెళ్లిపోయాడు. శ్యామ్ పుస్తకాలు పట్టుకుని రాసుకోవడానికి కూర్చోన్నాడు.
‘వీరి గురించేనా నీవు తీవ్రంగా ఆలోచించింది ’అన్నాడు విశ్వాస్.
‘అవును అంత మాట అన్నవాడిని వీడు ఎలా క్షమించాడు. నాకు అరికాలి మంట నెత్తికెక్కినట్టు ఉంటే వీడేంటి వాడ్ని ఏకంగా ఇంటికి తీసుకొని వచ్చాడు. పైన వాళ్లు ఏమాట్లాడుకుంటున్నారు వాళ్లు.. ’ కోపంగా అడిగింది ప్రశాంతి.
‘చూడు.. మనం పిల్లల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’
‘పిల్లలు ఇపుడు కొట్లాడుకుంటారు. మాట మాట అనుకుంటారు. కాని కాసేపటికి వారి కోపం తగ్గిపోతుంది. మళ్లీ వాళ్లు కలసిపోతారు.వారి కోపం తాటాకు మంట వంటిది. నిజానికి మనమూ అట్లానే ఉండాలి. కోపం విడవాలి. మనిషి అన్నాక కోపం వస్తుంది. కాని ఆ కోపానే్న పట్టుకొని అవతల వారికి నష్టం వచ్చేలా చేయకూడదు. పిల్లల్లా మనమూ క్షమించడమో చేసిన నేరాన్ని మర్చిపోవడమో చేయాలి. అంతేకాని దానే్న పట్టుకు వేలాడకూడదు.’అన్నాడు విశ్వాస్
ప్రశాంతి చెప్పిన దంతా మెల్లగా వింది. తనలోను ఆలోచన మొదలైనట్టు ఉంది. నిజమే పిల్లలు నిముషాల్లో కోపాన్ని మర్చిపోతారు. మరలా ఎప్పటిలా కలసిమెలసి ఆడుకుంటారు. మనమూ అట్లా ఉంటే...
అందరూ ఆనందంగా ఉండొచ్చు. కోపాలు తాపాలు ద్వేషాలు ఇవేవీ దరిచేరవు. అటు ఆరోగ్యమూ ఇటు ఆనందమూ ...
ప్రశాంతి మనసు ప్రశాంతమైంది.

- మానస