ఈ వారం కథ

పోలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా అమ్మా నాకు మాథ్స్‌లో 99 మార్క్స్ వచ్చాయి’ పరుగెత్తుకు వచ్చాడు అనీల్
‘గుడ్.. సరే కానీ ఆ సురేష్‌కు ఎన్ని వచ్చాయి?’అడిగింది అంజని.
‘నన్ను మెచ్చుకోవు అమ్మా నువ్వెప్పుడూ ఆ సునీల్ గురించే అడుగుతావు’ కోపంగా అన్నాడు అనీల్.
‘అది కాదు నాన్న నాకు నువ్వొక్కడివే క్లాస్ ఫస్టు రావాలి అనిపిస్తుంది. అందుకే అలా అడుగుతాను’అంది అంజని.
‘వాడికి మరి 100 మార్క్స్ వచ్చాయి. నీకిప్పుడు నాపైన కోపమేనా’ఎంతో బాధగా అడిగాడు అనీల్.
‘నువ్వు ఏం తప్పు చేశావు. నీకు నేను అన్నీ నేర్పాను కదా. మీటీచర్ చెప్పినవన్నీ నేర్పించాను. ఇంపార్ట్‌టెంట్‌కు ఇచ్చినవన్నీ నువ్వు చేశావు కదా. మరి వాడికి ఒక్కమార్కు ఎందుకు ఎక్కువ వచ్చింది’ ఎంతో విసుగ్గా అడిగింది అంజని.
‘స్కూల్‌లో టీచర్ మీరిద్దరూ బాగా చదివారు. వెరీగుడ్ ఇలానే మార్కులు తెచ్చుకోండి. తక్కువ వచ్చిన వారికి మీరిద్దరూ వారికి మాథ్స్ నేర్పించండి వెరీగుడ్ అంది’మాట మార్చాడు అనీల్.
‘ఆ టీచర్‌తో ఒక్కసారి మాట్లాడాలి. ’అంది అంజని అంతలో‘అనీల్ అనీల్ వస్తావా ఆడుకోవడానికి రా నేను బాల్ తెచ్చాను ’అంటూ వచ్చాడు సురేష్
‘ఆ వచ్చావా. నీకేం నాయనా నీకు వందకు వంద మార్కులు వచ్చాయి అని ఆడుకుంటావు. మావాడికి రాలేదు కదా. వాడ్ని చదువుకోనివ్వు. నువ్వెళ్లు’ కోపంగా అంది అంజని.
‘ఆంటీ ఒక్కమార్కునే గా ఎక్కువ వచ్చింది. అనీల్ అన్నీ కరెక్ట్‌గా చేశాడు. కాని ఒక్క డివిజన్‌లో తప్పు చేశాడు. అంతే అన్నీ వాడికి నాలాగే వచ్చు. మళ్లీ నేను వాడికి నేర్పిస్తాను. కాసేపు ఆడుకుంటాం ఆంటీ పంపించవా’అన్నాడు సురేష్.
‘మీ అమ్మతో చెప్తానుండు నీ సంగతి. మావాడ్ని చదువుకోనివ్వకుండా రోజు వస్తున్నావని ’అంటూ ముందుకు వచ్చింది అంజని.
‘వద్దు ఆంటీ వద్దు. మా అమ్మతో చెప్పకు. నన్ను కొడుతుంది. నేను వెళ్లిపోతున్నాను’అంటూ సురేష్ పరుగెత్తి వెళ్లిపోయాడు.
అనీల్ మొహం నల్లగా పెట్టుకుని కూర్చున్నాడు.
మళ్లీ ఆ మాథ్స్ అంతా నాకు చేసి చూపించు ఆర్డర్ వేసి వెళ్లింది అంజని.
దూరంగా మంచం మీద కూర్చుని చూస్తున్న విరూపాక్షి అంజని వెళ్లిన తరువాత మెల్లగా వచ్చి అనీల్ పక్కన కూర్చుంది.
‘నాన్నా. నీకు మంచి మార్కులు వచ్చాయి. నువ్వు మీ టీచర్ చెప్పినట్టు వెరీగుడ్. కాని మీ అమ్మ ఆ ఒక్కమార్కు కూడా తెచ్చుకోవాలని చెబుతోంది. అంతే నల్లమొహం తో కాక చక్కగా ఆనందం లెక్కలు నేర్చుకోరా. నీకు అన్నీ వచ్చేస్తాయి. మా బాబూ బంగారం ’అంటూ తలనిమిరింది అనీల్‌కు విరూపాక్షి.
అనీల్ బోర్ మంటూ ఏడ్చేసి ‘నాన్నమ్మా నే...ను నే ... ను అన్నీ బాగా చేశాను. కాని నాకు నైన్త్ టేబుల్ సరిగా రాదు. అందుకే తప్పు పోయింది ’అని కళ్లు తుడుచుకుంటూ చెప్పాడు అనీల్.
‘అంతేనా .. దానిదేముంది. నీకు త్వరగా ఈజీగా వచ్చేట్టు నేను నేర్పిస్తాను కదా’ అని నైన్త్ టేబుల్ సులభంగా నేర్చుకోవడం చెప్పింది విరూపాక్షి.
‘అరే వేసేస్తున్నావు కదా. నీకు వచ్చేసినట్టే.’అంది విరూపాక్షి.
‘అవును ఇంత ఈజీ అనుకోలేదు. ఈసారి నాకు కూడా 100 మార్క్స్ వస్తాయి’ అన్నాడు అనీల్ .
అంతలో అక్కడికి అంజని వచ్చింది.
‘మీరు ఎందుకు మా వాడి చదువులో వేలు పెడుతున్నారు. మీ కాలం కాదు ఇది. అనవసరంగా వాడి చదువు పాడుచేయకండి. మీ వల్లనే వాడికి మాథ్స్ రాకుండా పోతుంది ’అంటూ వాళ్ల అత్తగారైన విరూపాక్షిని అంటూ పోయింది.
మధ్యలో అనీల్ ఏం జరిగిందో చెప్పినా కూడా వినిపించుకోలేదు. అనీల్ పుస్తకాల ముందు కూర్చున్నాడు. కాని వాడికి లెక్కలు వేయబుద్ధి కావడం లేదు.
విరూపాక్షి అంజని మాటలు పడలేక ఇక మీద చెప్పనులే అంది.
అంతలో అంజిబాబు వచ్చాడు.
‘నాన్నా నాకు .. ’అని అరవబోయి అమ్మను చూసి ఊరుకుండిపోయాడు అనీల్.
‘ఏమండీ మనవాడు మాథ్స్‌లో వీక్ అయిపోయాడు. మనం అర్జంట్ గా వీడికి మాథ్స్ కోచింగుకు పంపాలి అంది అంజని.
‘వీడు ఇంకా మూడో క్లాస్‌కు రాలేదు కదా. అపుడే మాథ్స్‌లో వీక్ ఏమిటి? ఇపుడు క్వార్టర్లీలో ఎన్ని వచ్చాయి ’అన్నాడు అంజిబాబు.
‘నాన్న 98 వచ్చాయి. నాకు కానీ అమ్మకు నచ్చలేదు’అన్నాడు అనీల్.
‘ఇంకెందు వీడికి కోచింగు. వాడ్నీ కాసేపు ఆడుకోనివ్వు రోజూ అపుడే ఆ ఒక్కమార్కు కూడా తెచ్చేసుకుంటాడు.’అన్నాడు అంజిబాబు
‘మీరు, మీ అమ్మ కలసి నాకొడుకుకు మంచి మార్కులు రానివ్వకుండా చేసేస్తున్నారు. ముందు వాడ్ని ట్యూషన్‌లో చేర్పిస్తారా? లేక నేనే వెళ్లి ట్యూషన్ మాష్టారు చూడమంటారా’ కోపంగా అడిగింది అంజని.
అంజని గురించి తెలిసిన అంజిబాబు ‘సరే సరే నీ ఇష్ట. నేను ఇప్పుడే వెళ్లి మంచి ట్యూషన్ మాష్టారు గురిం చి వెతుక్కుని వస్తా’అన్నాడు అంజిబాబు
‘ఇదిగో చూడండి. ఆ సురేష్ కన్నా కనీసం రెండు మార్కులు ఎక్కువగా వచ్చేట్టు చేస్తానని అంటేనే ఆ ట్యూషన్‌లో చేర్పిస్తాం అని చెప్పండి. మనం డబ్బులిచ్చినపుడు మనం చెప్పినట్టు వినాలి కదా. ’అంది అంజని.
ఏం మాట్లాడాలో తెలియక అంజిబాబు వౌనం వహించాడు.
అమ్మలు మారేదెప్పుడో అని అనీల్ వౌనం వహించాడు.
విరూపాక్షికి ఏం చేయాలో తెలియక వౌనం వహించింది.
తన మాట అందరూ విన్నారు కనుక ఏం చేయక్కర్లేదని అంజని వౌనం ధరించింది.

--మానస