ఈ వారం కథ

తప్పెక్కడ ఉంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏంటీ అంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నావు’అడిగింది సంధ్య
‘ఏమని చెప్పను. రెండు రోజుల నుంచి గమనిస్తున్నాను. రాణి ఒకటే అబద్ధాలు చెబుతోంది. ఎందుకు అలా చెబుతున్నావని అడిగితే నేను నిజమే చెబుతున్నాను అంటోంది’ అంది సంజన.
‘అసలు రాణి అబద్ధాలు చెబుతోందని నీకెందుకు అన్పించింది’
‘ఏమని చెప్పేది. నిన్న అసలు స్కూల్‌కు వెళ్లలేదు. కాని వెళ్లాలని టీచర్ రాలేదని చెప్పింది’
‘స్కూల్‌కు వ్యాన్ వస్తుంది కదా. వ్యాన్‌లోనే వెళ్తుంది కదా. వెళ్లలేదు అని నువ్వు ఎలా అనుకొంటున్నావు’
‘వ్యాన్ వస్తుంది. కాని వ్యాన్‌లో వెళ్తూ మధ్యలో నేను ఒకటి మర్చిపోయాను. మా నాన్న తో వచ్చేస్తాను. మీరెళ్లండి అని మధ్యలో దిగిపోయిందట.డ్రైవర్, ఆయమ్మ చెబుతున్నా వినలేదట. ’
‘అసలు వ్యాన్ ఎందుకు ఆపారు’
‘ఇంకెవరో పిల్లల్ను ఎక్కించుకోవడానికి ఆపారట. అపుడు ఇది దిగిపోయింది. డ్రైవర్ వెంటనే నాకు ఫోను చేసి చెప్పాడు.’
ఇది వస్తుందని ఎదురు చూసాను. కాని రాలేదు. నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉంది. నేను ఎంత కంగారు పడిపోయానో. కాని అది మాత్రం ఏమాత్రం కంగారు లేదు. హాయిగా ఎప్పటిలానే ఉంది. ’
ఎంతో టెన్షన్‌తో చెప్పింది సంజన.
‘ఒక్కసారే కదా. ఇంకెప్పుడైనా అట్లా చేస్తే చూద్దాం లే’ దీనికి కంగారు ఎందుకు’అంది సంధ్య.
‘ఇదే కాదు ఇంట్లో పర్సులో ఉండే డబ్బులు తీసేసింది. పైగా అక్కడ ఉన్నదని నాకేం తెలుసు. నువ్వే ఖర్చుపెట్టి నన్ను అంటున్నావు అని గట్టిగా దబాయిస్తోంది.’
‘డబ్బులా..’ ఆశ్చర్యంగా అడిగింది సంధ్య
‘అసలు నీకు ఒకటి చెబుతాను విను’ అంటూ మొదలెట్టింది.
రాణి చాలా మామూలుగా ఉండేది. కాని ఈమధ్యనే వాళ్ల అత్త వచ్చింది. రెండు రోజులు ఉంది. ఆమెతో బాగా ఆడుకుంది. ఆమె డ్రస్సులు, అవి ఇవీ బాగా కొనిపెట్టింది. అత్త మంచిది అని తిరిగింది. నేను అపుడు తిట్టాను. కాని ఆమె వెళ్లిన దగ్గర నుంచి అన్నీ అబద్ధాలే చెబుతోంది. నేను నిన్న గుర్తించాను. అంతకుముందు ఆలోచిస్తే ఇది అబద్ధాలు బాగా చెబుతోందని అన్పించింది.
మా అమ్మతో అన్నాను. ఆమె అంది అది చిన్నప్పటి నుంచి అబద్ధాలే చెబుతుంది. దానికి ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసు అని దాన్ని మెచ్చుకుంది.
కాని నాకే దాని వ్యవహారం మింగుడు పడడం లేదు. ఆందోళనతో ముగించింది సంజన.
‘సరే నేను ఒక విషయం చెబుతాను. నీవు ఏమీ అనుకోనంటే. నువ్వు ఇంత బాధ పడుతున్నావు కనక చెబుతాను అంటున్నాను. ఇలా చెప్పానని మళ్లీ నాపై కోపం, రుసరుసలు, మాట్లాడక పోవడం లాంటివి చేయనని మాటివ్వాలి. పైగా నువ్వు చేస్తున్నది ఇది అని నేను అంటే నువ్వు దాన్ని బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి అంతేకాని నన్ను అన్నావా అంటూ అహం తో ఇబ్బంది నీవు పడకూడదు. నన్ను పెట్టకూడదు. నేను ఇంతగా ఎందుకు చెబుతున్నానో ఆలోచించు నువ్వు చెప్పమంటే చెబుతాను ’అంది సీరియస్‌గా సంధ్య.
కొద్దిసేపు వౌనం తరువాత సంజన నువ్వు ఏమి చెప్పినా ముందు ఆలోచించుకుని అందులో నిజమెంతో తెలుసుకొని ఆ తరువాత దానిగురించి నేను నీతో మాట్లాడుతాను అని మాటిచ్చింది.
నాకు మీ రాణి గురించి నాకు ఎపుడో తెలుసు. నిజమే నువ్వు అనుకొంటున్నది. రాణి అన్నీ అబద్ధాలే చెబుతుంది. నీకు తెలియకుండా దైనినైనా చేయడానికి వెనుకాడదు. ఇది నిజమే. అది నిన్న ఇవాళ వచ్చిన అలవాటు కాదు. ఎప్పట్నుంచో ఉంది.
అని ముగించగానే ‘అదేంటి అలా అనేశావు’అందిసంజన.
‘నేను చెప్పేది అంతా నీవు సరిగా విను. ఆ తరువాత నిజమో అబద్ధమో తెలుసుకొని మళ్లీ మాట్లాడు. ’అంది సీరియస్‌గా సంధ్య
నీవు మీ అత్తగారి గురించి, మీ ఆడపడచు గురించి అన్నీ నిజాలే మీ ఆయనతో చెబుతున్నావా... మా కందరికీ అంటే ఇరుగు పొరుగు వాళ్లతో అన్నీ నిజాలే చెబుతున్నావా ఒక్కసారి ఆలోచించుకో.
లేదు. నువ్వు ఎలాగైతే వాళ్ల మీద అబద్ధాలు చెప్పుతావో అట్లాగే తనకిష్టం లేని వాళ్లపైన రాణి అబద్ధాలే చెబుతుంది.
ఇక డబ్బులు అంటావా...
నువ్వు మీ ఆయనకు అబద్ధాలు చెప్పి ఆ డబ్బులు నీ సొంతానికి ఖర్చు చేసుకుంటున్నావు. అంటే దుబారా చేస్తున్నావని కాదు. మీ అమ్మకు ఇవ్వడమో లేక ఇంకేదైనా నో కాని అవి అన్నీ మీ ఆయనతో నీవు చెప్పవు అదే పని మీ అమ్మాయి చేస్తోంది. మీ డబ్బులు తీసుకొని అది కాంటిన్‌లో కొనుక్కొని తింటుంది. పైగా ఎవరు తనతో స్నేహంగా ఉంటారో వారికి కొనిస్తుంది. తనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లపైన ఏ అబద్ధమైనా బెరుకు లేకుండా చెప్పేస్తుంది. అది ఎదుటివాళ్లకు నష్టం కలిగించేదైనా.
ఇది ఎప్పట్నుంచో చేసే పనే.
కాని నీకు నిన్న దానివల్ల ఇబ్బంది ఏర్పడింది కనుక నీవు ఇపుడు ఆలోచిస్తున్నావు. రాణి ఇలా మారడానికి కారణం నువ్వే. ఇది నీవు అంగీకరిస్తే నిన్ను నువ్వు మార్చుకో. వెంటనే మీ అమ్మాయిలో కూడా మార్పు వస్తుంది. లేకపోతే నన్ను తప్పు పట్టితే నేను ఏమీ చేయలేను. అసలు నేను చెప్పినవన్నీ నువ్వు ఒక్కదానివే కూర్చుని ఆలోచించుకో అపుడు జరుగుతున్నది ఏమిటి ఎందుకు జరుగుతున్నదో నీకే అర్థం అవుతుంది అని అలసటతో ఆగింది సంధ్య.
ఒక్కక్షణం వౌనం రాజ్యమేలింది.
మెల్లగా సంజన నోరు విప్పింది.
ఇదంతా నీవు ఎలా చెప్పగలుగుతున్నావు. నేను ఎపుడూ నీకేమీ చెప్పలేదు కదా అడిగింది.
ఏముంది. నిన్ను, నీ ఆడపడచును కూడా నేను చూస్తుంటాను. ఆమె కూడా నా ఫ్రెండే . కాకపోతే మనిద్దరం ఫ్రెండ్స్ కనుక ఆమె నాతో ముబావంగా ఉంటుంది. పెద్దగా మాట్లాడదు. నీవు చెప్పేవి ఆమె నేచర్ చూసి ఇవన్నీ గెస్ చేశాను. మీ అమ్మాయితో పాటు మా అమ్మాయి ఒకే స్కూల్ కదా. పైగా మీ అమ్మాయి తన స్నేహితులతో మాట్లాడే మాటలు మా అమ్మాయి విని నాతో చెబుతుంటుంది. అవి అన్నీ వింటాను కదా. పైగా మీ కూతురు మా ఇంటికి వస్తుంటుంది. నీ గురించి వాళ్ల అత్త గురించి చెబుతుంటుంది.
ఇవన్నీ కలిపి చూస్తే నీకొచ్చిన ప్రాబ్లెం అర్థమయింది. అందుకే చెప్పాను. నువ్వు నాకు మంచిఫ్రెండ్ వి కనుక . ఇక నీ ఇష్టం. అంటూ వస్తాను అని సెలవు తీసుకొంది సంధ్య.
ఒంటరిగా ఉన్న సంజన మెదడు వెనక్కు పరుగులు తీసింది. జరిగిన సంగతులు అన్నీ మనసు చెప్పడం ఆరంభించింది.
కొద్దిసేపటికి రీళ్లు అన్నీ తిరిగేసాక
నిజమే . నేను నా సర్వైవల్ కోసం ఒంటరిగా మా దగ్గరే ఉంటున్న ఆడపడచు మీద ప్రభాకర్‌తో అబద్ధాలే చెబుతుంటాను.
నిజమే .. మా అమ్మకు డబ్బులు ఇవ్వాలంటే ప్రభాకర్ ఏమనుకొంటోడో అని అబద్ధాలే చెబుతుంటాను.
అయితే ఇవన్నీ రాణిపైన ఇంత ప్రభావం చూపించాయా ... అనుకొన్నంతలో పిల్లలు వచ్చిన సౌండ్ వినవచ్చింది. ఏం చేస్తారో చూద్దాం అని సంజన దాక్కొంది.
‘నేను చెప్పాను కదా. అమ్మ ఆఫీసుకు వెళ్లి ఉంటుంది. లేకపోతే అమ్మమ్మ దగ్గరకు అయినా వెళ్తుందని ’రాణి గొంతు
‘నిజమేనే.. కాని ఇపుడు ఈ డబ్బు తీస్తే అమ్మ వచ్చి చూసుకొంటే తెలుస్తుంది కదా. అసలే నిన్న డబ్బు పోయింది అని తిట్టింది కదా’ అనీల్ గొంతు
‘ఏ వూరుకో.. నీకు తెలివి లేదు. ఈ డబ్బు ఖర్చు అయిపోయిందని నాన్నతో అమ్మ చెప్పడం వినలేదా నువ్వు. ఇపుడు ఎలాపోయిందని చెబుతుంది పిచ్చి తమ్ముడూ నేను చెప్పినట్టు విన్నావా.. నీకు చాక్లేట్స్ డైరీ మిల్క్ సిల్క్ కొనిస్తాను. లేకపోతే నా సంగతి తెలుసు గదా.’ రాణిగొంతు
‘ఏంటి అక్కా నువ్వు నన్ను కూడా బెదిరిస్తున్నావు. నిన్న స్కూల్‌కు రాకుండా గోపాల్‌తో వెళ్లావని అమ్మతో చెబుతాను. ’ అనీల్
‘చెప్పు. అయినా అమ్మ ఏం చేయలేదు.నన్ను అడగలేదు. అత్త ఎదురింటి ఆయనతోమాట్లాడుతోందని అమ్మ నాన్నతో చెప్పింది కదా. అది అబద్ధమని అమ్మ ఫ్రెండే ఆయన అత్తకు కాదు అని చెప్పేస్తాను అని అమ్మతో అంటాను. ’
‘ఏంటి అమ్మను కూడా బెదరిస్తావా ’ అనీల్
‘అమ్మ ఐతే ఏంటి నన్ను అడుగుతుందా’ రాణి
‘సరేనే నీ ఇష్టమొచ్చినట్టు ఉండు. నేను ఏమీ చెప్పనులే.’ అనీల్
‘సరే నేను ఇప్పుడే వస్తాను. నువ్వు హొం వర్క్ చేసుకో. అమ్మ వస్తే గీత కు మాథ్స్ చెప్పడానికి వెళ్లానని చెప్పు’ రాణి వెళ్లిన సౌండ్ .
అమ్మో ఏదో జరిగిపోతోంది. అంతా నావల్లనే. నేను మారాల్సిందే. నా పిల్లల్ను కాపాడుకోవాలి అనుకొంటూ సంజన బయటకు వచ్చింది.
‘అమ్మా నువ్వు ఇంట్లోనే ఉన్నావా ’కంగారుగా అనీల్
‘అవునురా ఇప్పుడే వచ్చాను. మీరెప్పుడు వచ్చారు.’అంది సంజన. ఏమీ ఎరుగని దానిలా...
‘ఇపుడే అమ్మా రాణి .....’ ఏదో చెప్పబోయాడు అనీల్
‘సర్లేరా .. ఫ్రెండ్ దగ్గరకు వెళ్లిందా.. ’ వస్తుందిలే. నీకు ఏం కావాలో చెప్పు అది తినడానికి చేస్తాను’ అంటూ తాను మారుతూ తన పిల్లలను ఎలా మంచిమార్గానికి మార్చుకోవాలో ప్లాను వేస్తూ వంటింట్లోకి వెళ్లింది సంజన.
‘అమ్మ ఇపుడు మేము మాట్లాడుకున్నవి విన్నదా లేదా... ఒకవేళ వింటే ... వినలేదేమో లేకపోతే అడిగేది కదా.. అయినా నాకేమిలే.. అక్క చూసుకొంటుంది’ ఎన్నో ఆలోచన్లతో అనీల్ వీధివంక చూస్తున్నాడు. అంతలో రాణి లోపలికి వస్తూ కనిపించింది.
‘అక్కా ! అక్కా అమ్మ వచ్చేసింది ’ మనకోసం పకోడి వేస్తోంది ’ ఇన్‌ఫర్‌మేషన్ ఇచ్చేసాడు.
‘ఓహో’ అంటూ వంటింట్లోకి వెళ్లింది రాణి.

-మానస