ఈ వారం కథ

సంసార వృక్షానికి ఎరువులివిగో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజా, రవి ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. రోజా వాళ్ల తల్లిదండ్రులు ఎన్నో సంబంధాలు చూసి చూసి ఎన్నో కోణాలనుంచి అబ్బాయి వాళ్లను తరిచి చూసి ఎంతో బాగుంటారు అనుకొన్న తరువాత మాత్రమే వారి పెళ్లి చేసారు.కాని రోజా రోజో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టు తల్లిదండ్రులతో చెప్పడంతో వాళ్లల్లో అశాంతి కలిగింది. ఏమిటి ఇన్ని చూశాము. పైగా వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. పైగా ఒకే ఒక్కకొడుకు, కూతురికి పెళ్లి చేసి పంపారు. ఇంట్లో అత్తమామ ఇద్దరేఉంటారు. వీరిద్దరూ ఆఫీసుకు వెళ్లి వచ్చేసరికి అత్త గారు ఇంట్లో పనులు చూస్తానని చెప్పారే.. ఎందుకు మన అమ్మాయి బాధపడుతోంది. అల్లుడేమన్నా మంచివాడు కాదేమో ... దేనికోసమైనా బాధపెడుతున్నాడేమో ... ఇలా అనుకొంటూ రోజా తల్లిదండ్రులు తెగ బాధపడుతున్నారు... ఒకరోజు రోజా పొద్దునే్న వచ్చేసింది. ‘మమీ ఇక నేను రవి దగ్గరకు వెళ్లను. విడాకులు తీసేసుకుంటాను. నన్ను మీరు ఇబ్బంది పెట్టకండి. వాళ్ల అమ్మ వస్తే మీతో మాట్లాడానికి ఏమీ లేదు. మీరు జోక్యం చేసుకోకండి అనే గట్టిగా చెప్పేసేయండి’అని చెప్పి తాను ఆఫీసుకు వెళ్తున్నట్టు చెప్పి ఎంత హడావుడిగా వచ్చిందో అంతే హడావుడిగా వెళ్లిపోయింది బ్యాగ్ ఇంట్లో పడేసి.
ఆ మాటలకు రోజా తల్లిదండ్రులు అవాక్కు అయ్యారు. ఇదేంటి మనం సంబంధం వెతికనన్ని రోజులు పట్టలేదు మన అమ్మాయి రవి దగ్గరకు వెళ్లనని చెప్పేసి వచ్చేసింది.. ఎంత ఈజీగా అనేసింది అని వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు...
నిజమే.. ఇట్లాంటి వాళ్లు ఈమధ్య పుట్టుకొస్తున్నారు. ఇది ఒకరింటి సమస్య కాదు..అట్లాఅంటే సమస్యల్లేని ఇళ్లు ఉండవు. బుద్ధుడు కూడా సమస్యలేని ఇల్లు ఉందేమో అని చాలా చోట్ల వెతికాడట. అట్లా ప్రతింట్లో ఓ కుంపటి ఉంటే మా ఇంట్లో మరోకుంపటి అంటారు సమస్యలతో వేగేవాళ్లు. నిజమే అయ్యుండొచ్చు గాక. కాని సమస్యలకు కారణాలేంటి. ఆర్థికమా , మానసికమా అని ఆలోచిస్తే కొన్ని సార్లు సమస్యలు అనుకొన్నవి అసలు సమస్యలు గాకుండా పోతున్నాయి. కాని ఇగో వల్లనో, మరొకరి పొడ గిట్టనందువల్లో సంసారాలను కాలదన్నుకునేవాళ్లు ఎక్కువ అవుతున్నారు. కొన్ని సర్వేలు ఆర్థికంగా ఒకరిపై ఒకరు ఆధార పడట్లేదు కనుక ఎవరికి వారు స్వేచ్ఛగా బతకాలనుకొంటూ భార్యభర్తలు విడిపోతున్నారు అంటున్నారు.
భార్యాభర్తలు అంటే ఆర్థికంగానో, మానసికంగానో ఒకరిపై ఒకరు ఆధార పడడం కాదు కదా. ఒకరంటే ఒకరికి అభిమానం, అప్యాయతా, ప్రేమానురాగాలు ఉండాలి. పెళ్లి కానంత వరకూ వధూవరులు వేరు వేరు. ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు. కాని పెళ్లి తర్వాత ఇద్దరూ కలసి ఒకటవుతారు. ఇద్దరూ సామరస్యంతో, స్నేహపూర్వకంగా ఒకర్ని మరొకరు గౌరవించుకుంటూ ఒకరి బలహీనతలను కూడా మరొకరు ఎద్దేవా చేయకుండా ఒక్కటిగా ఉండాలి. ఇద్దరూ కలసి దాంపత్యజీవితాన్ని అనుభవించాలి. సంసార మనే వృక్షానికి వేళ్లు వారిద్దరూ కావాలి. అపుడే ఆ వృక్షానికి బంధువులు, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు ఇట్లాంటి వారంతా కొమ్మలు రెమ్మలుగా తయారు అవుతారు. పెళ్లి అంటే కేవలం రెండు మనసుల కలయిక నే కాదు రెండు కుటుంబాల కలయిక.తరాల అంతరాలను తొలగదోసి కొత్త తరానికి ఆహ్వాన గీతిక పాడే సరికొత్త వేరు దాంపత్యమనే వృక్షపు వేరు. ఈ వేరును బాగా నాటుకుంటే తర్వాతి తరాలకు ఆయువు పట్టు. అందుకే పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ఒక కుటుంబంలో పుట్టి మరో కుటుంబంలోకి వచ్చి రెండు కుటుంబాల వారిని ఒక్కటిగా చేసే నేర్పు కేవలం ఒక్క స్ర్తిలోనే ఉంటుంది. ఆ స్ర్తి ఇరువురి సంప్రదాయాలను, సంస్కృతిని, ఆచార వ్యవహారాలను తాను ఆకళింపు చేసుకొని తర్వాతి తరానికి తరగని గనిగా అందిస్తుంది. ఇరువైపులా ఉన్న బంధువులకు వీరిద్దరి స్నేహసౌరభాలను పంచాలి. కాని వీరు మీవాళ్లు వాళ్లు మా వాళ్లు అనే భేదాలు పెట్టుకొని వారి ని తారతమ్యభావాలతో చూస్తే వారంతా ఒకనాడు దూరమై పోతారు. ఒంటరిగా అంటే భార్యాభర్త పిల్లలు ఇదే సంసారం అనుకొంటే కొన్నాళ్లకు ఆత్మీయతను పంచేవారు ఎవరూ లేరనే మానసిక అసంతృప్తికి లోనవుతారు. అప్యాయతానురాగాలు కొనుక్కుంటే వచ్చేవి కావు. కనుక అవి కేవలం పంచితేనే ఎక్కువ అవుతాయి. కనుక దాంపత్యం అనే గొడుగు కిందకు చేరిన భార్యాభర్తలిద్దరూ మమతానురాగాలతో వారు మెలగడమే కాదు అందరికీ పంచడం మొదలుపెడితే వారికెన్నో ఫలాలు అందుతాయి.
అంత మంచి చేవగలిగిన ఇల్లాలే తరువాతి తరానికి పట్టుకొమ్మ అవుతుంది. కనుకనే పెళ్లి అనే నారుమడికి వధూవరుల సంస్కారాలే మంచి ఎరువుగా పనికి వస్తాయి.వారిద్దరూ వేర్వేరుగా కాకుండా అనురూపులు మారాలి. ఒకరి మనసు గురించి మరొకరు తెలుసుకోగలగాలి. అపుడే వధువు తల్లిదండ్రులు, వరుని తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. నేడు కనిపిస్తున్న వృద్ధాశ్రమాలకు కూడా కనుమరుగు అవుతాయి. ఇవి అన్నీ కావాలంటే కేవలం వధూవరులిద్దరికీ ఓర్పుసహనం, క్షమ మంచితనం అనే గుణాలు అలవడాలి.

-రమ్య