బిజినెస్

లాభాలతో 2015కు వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెన్‌సెక్స్ 158, నిఫ్టీ 50 పాయింట్లు వృద్ధి
ఏడాది మొత్తంలో 5 శాతం నష్టపోయిన మార్కెట్లు
ముంబయి, డిసెంబర్ 31: ఏడాదిలో చివరి ట్రేడింగ్ రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసి 2015 సంవత్సరానికి వీడ్కోలు పలికాయి. రియల్టీ, ఐటి రంగాలకు చెందిన స్టాక్స్‌తో పాటుగా మెటల్, గ్యాస్, విద్యుత్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు మంచి లాభాలు ఆర్జించడంతో బిఎస్‌ఇ సెన్‌సెక్స్ 158 పాయింట్లు లాభపడి 26, 117.54 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే, ఏడాది క్రితంతో పోలిస్తే సెన్‌సెక్స్ 5 శాతానికి పైగా పతనమైంది. డిసెంబర్ నెల ఫ్యూచర్స్, ఆఫ్షన్స్ సిరీస్ గడువు ముగియడంతో పాటుగా కొత్త సంవత్సరంలో బ్లూచిప్ కంపెనీల లాభాలు మెరుగుపడగలవన్న అంచనాలతో మదుపరులు భారీ ఎత్తున కొనుగోళ్లు జరపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు తీశాయి.
నిన్నటి ముగింపుకన్నా పై స్థాయిలో 25, 980.86 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్‌సెక్స్ చివరికి 157.51 పాయింట్ల లాభంతో 26,117.54 పాయింట్ల వద్ద ముగిసింది.జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ దిఫ్టీ సైతం 50.10 పాయింట్లు పెరిగి 7,946.35 పాయింట్ల వద్ద ముగిసింది.
గత ఏడాది దాదాపు 30 శాతం మేర లాభపడిన తర్వాత సెన్‌సెక్స్ మొత్తం మీద 2015లో 1381.88 పాయింట్లు (అంటే 5.02 శాతం) నష్టపోయింది. 2011 తర్వాత సెన్‌సెక్స్ నష్టపోయింది ఈ ఏడాదే. 2011లో సెన్‌సెక్స్ 24 శాతం మేర పతనమైంది. ఆర్‌బిఐ తన కీలక వడ్డీ రేట్లను తగ్గించడంతో ఈ ఏడాది మార్చిలో సెన్‌సెక్స్ 30,024.74 పాయింట్ల లైఫ్‌టైమ్ హైకి చేరుకున్న విషయం తెలిసిందే. నిఫ్టీ సైతం ఈ ఏడాది 336.35 పాయింట్లు (4.06 శాతం) నష్టపోయింది. మార్చి 4న 9,119.20 పాయింట్ల ఆల్‌టైమ్ హైని తాకిన ఈ సూచీ సెప్టెంబర్ 8న 7,539.50 పాయింట్ల కదిష్టస్థాయిని కూడా తాకింది. డాలరుతో రూపాయి సైతం ఈ ఏడాది కాలంలో 5 శాతం మేర నష్టపోయింది. సెన్‌సెక్స్‌లోని కంపెనీల షేర్లలో హెచ్‌డిఎఫ్‌సి 2.39 శాతం లాభపడగా, గెయిల్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ సైతం 2 శాతానికి పైగా లాభపడ్డాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిల్, మారుతి సుజుకి, టిసిఎస్, ఎంఅండ్‌ఎం, టాటాస్టీల్, ఐటిసి కూడా మంచి లాభాలనే ఆర్జించాయి. అయితే యాక్సిస్ బ్యాంక్, హీరో మోటో కార్ప్, ఎల్‌అండ్‌టి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, సిప్లా నష్టపోయిన కంపెనీల్లో ఉన్నాయి. అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్‌ఎఫ్‌డిఏ)కాడిలా హెల్త్‌కేర్‌కు చెందిన గుజరాత్‌లోని రెండు ఔషధ తయారీ విభాగాలను హెచ్చరించిన నేపథ్యంలో ఆ కంపెనీ షేరు అటు బిఎస్‌ఇ, ఇటు ఎన్‌ఎస్‌ఇ రెండింటిలోను దాదాపు 15 శాతం మేర నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఆసియా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించగా, ఐరోపా మార్కెట్లు ప్రారంభంలోనే నష్టాల్లో సాగాయి.