బిజినెస్

భారత్‌లోకి భారీగా సింగపూర్ ఎఫ్‌డిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) ప్రథమార్ధంలో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డిఐ) అత్యధిక శాతం సింగపూర్ నుంచి వచ్చినవే ఉన్నాయి. ఈ ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో సింగపూర్ నుంచి 43,096 కోట్ల రూపాయల (6.69 బిలియన్ డాలర్లు) ఎఫ్‌డిఐ భారత్‌కు వచ్చింది. ఆ తర్వాత మారిషస్ నుంచి 23,490 కోట్ల రూపాయల (3.66 బిలియన్ డాలర్లు) ఎఫ్‌డిఐ వచ్చింది. ఈ మేరకు పారిశ్రామిక విధాన, ప్రగతి శాఖ (డిఐపిపి) తెలియజేసింది. ఇంతకుముందు భారత్‌కు అత్యధికంగా ఎఫ్‌డిఐ వచ్చే దేశాల్లో మారిషస్ మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు దాన్ని సింగపూర్ అధిగమించింది.