బిజినెస్

భారతీయ టెక్స్‌టైల్ సంస్థపై అమెరికా కోర్టు లక్ష డాలర్ల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 29: వ్యాపార నిబంధనలను అతిక్రమించిన ఓ భారతీయ టెక్స్‌టైల్ సంస్థకు లక్ష డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు 65 లక్షల రూపాయలు) జరిమానాను విధించింది అమెరికా కోర్టు. పైరేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించినందుకుగాను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రధాన కేంద్రంగా టెక్స్‌టైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ప్రతిభ సింటెక్స్ లిమిటెడ్‌కు లాస్ ఏంజిల్స్ సూపీరియర్ కోర్టు ఈ జరిమానా వేసింది. వాల్‌మార్ట్ తదితర ప్రముఖ అమెరికా సంస్థలకు బట్టలను ఎగుమతి చేస్తోంది ప్రతిభ సింటెక్స్ లిమిటెడ్. ఈ క్రమంలోనే ఈ సంస్థ చేసిన చర్య అమెరికా వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని కోర్టు అభిప్రాయపడుతూ లక్ష డాలర్ల జరిమానాను వేసింది. కాగా, ఈ జరిమానాను 30 రోజుల్లో చెల్లించేందుకు ప్రతిభ సింటెక్స్ లిమిటెడ్ అంగీకరించింది.