బిజినెస్

అనుమానిత లావాదేవీలపై ఎఫ్‌ఐయు నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

72 గంటల్లోనే పూర్తి సమాచారం సేకరణ
నల్లధనం అదుపునకు దర్యాప్తు సంస్థలన్నీ జట్టు

న్యూఢిల్లీ, నవంబర్ 22: పన్నులను ఎగవేస్తూ నల్లధనాన్ని పోగేస్తున్న అక్రమార్కుల పనిపట్టడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయు)ను తీసుకొచ్చింది. ఈ యూనిట్ కేవలం 72 గంటల్లో అక్రమ లావాదేవీల వివరాలను సేకరించి నిక్షిప్తం చేస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆదాయ పన్ను శాఖ, సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్, డిఆర్‌ఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో సహకారంతో ఈ యూనిట్ పనిచేస్తుంది. ఇంతకుముందు పత్రాల ఆధారంగా జరిగే సమాచార మార్పిడి ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరగనుంది. నిజానికి ఏదైనా సమాచారం కావాలంటే మునుపు దర్యాప్తు సంస్థలకు 15 నుంచి 20 రోజుల సమయం పట్టేది. అయితే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ పేరిట అన్ని దర్యాప్తు సంస్థలు కలిసి పనిచేయడంతో సమాచార సేకరణ మూడు రోజుల్లోనే పూర్తవుతుందంటోంది కేంద్రం. కాగా, ఈ నెల 1 నుంచే ఎఫ్‌ఐయు కార్యకలాపాలు మొదలవగా, నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా ప్రభుత్వానికి సమర్పించిన తమ తొలి నివేదికలో ఎఫ్‌ఐయు బలోపేతానికి సిఫార్సులు చేసింది. దీనివల్ల దర్యాప్తు సంస్థల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది. అనుమానిత లావాదేవీలపై జాతీయ స్థాయిలో ఎఫ్‌ఐయు దర్యాప్తు చేస్తుంది.