ఫ్లాష్ బ్యాక్ @ 50

మంచి మిత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యానర్: మధు పిక్చర్స్
కళ: కృష్ణారావు
ఛాయాగ్రహణం: ఎస్ వెంకటరత్నం
కూర్పు: పి శ్రీహరిరావు
నృత్యం: శ్రీను
సహాయకురాలు: శకుంతల
స్టంట్స్: ఎఆర్ భాషా
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
సంగీతం: ఎస్‌పి కోదండపాణి
నిర్మాత: పి.మల్లికార్జునరావు
దర్శకత్వం: తాతినేని రామారావు
===========================================================

తాతినేని ప్రకాశరావుకి బంధువైన తాతినేని రామారావు కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో 1938లో జన్మించారు. సినీరంగంపై మక్కువతో మద్రాసువెళ్లి, తాతినేని ప్రకాశరావు, ప్రత్యగాత్మలవద్ద దర్శకత్వ శాఖలో సహాయకునిగా పనిచేశారు. దర్శకత్వపు మెళకువలు ఆకళింపు చేసుకున్న ఈయన తొలిసారిగా ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ‘నవరాత్రి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. తరువాత 65కుపైగా హిందీ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించి పేరుపొందారు. ‘ఆఖరీ రాస్తా’, ‘దిల్’వంటి కొన్ని హిందీ చిత్రాలు వీరు నిర్మాతగా రూపొందించినవే. పలు విజయవంతమైన తెలుగు, హిందీ చిత్రాలను నిర్మించిన మధు పిక్చర్స్ అధినేత మల్లిఖార్జునరావు 1969లో వీరి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం -మంచి మిత్రులు.
1967లో -మంచి మిత్రులు చిత్రం తొలుత తమిళంలో ఏవీయం సంస్థ ‘పందియము’గా నిర్మించింది. జెమినీ గణేశన్, ఏఎం రాజన్, వెనె్నరాడై నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు. ఆ చిత్రానికి కాశీలింగం దర్శకత్వం వహించారు. సంగీతం టిఆర్ పాపయ్య, నిర్మాత ఎంకెఎం వేణు. తరువాత ఈ చిత్రాన్ని తెలుగులోనూ, హిందీలోనూ రూపొందించారు. 1969లో మంచి మిత్రులు చిత్రం విడుదలైంది. హిందీలో ‘సచ్చాయి’ టైటిల్‌తో వచ్చిన చిత్రానికి కె శంకర్ దర్శకత్వం వహించారు. శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చగా సంజీవ్‌కుమార్, షమీకపూర్, సాధన ముఖ్య పాత్రలు పోషించారు. ఎంజి రామచంద్రన్ బంధువు ఎంసి రామమూర్తి హిందీ చిత్రాన్ని నిర్మించారు.
**
గోపి (కృష్ణ), శ్రీను (శోభన్‌బాబు) స్నేహితులు. ఒకే రూములో కలిసి జీవిస్తుంటారు. గోపికి ఆవేశం ఎక్కువ. శ్రీను సమయానుకూలంగా సర్దుకుపోతుంటాడు. ఒకనాడు ఆఫీసర్‌తో వచ్చిన చిన్న తగాదా కారణంగా గోపి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఈ సంఘటన గోపి, శ్రీను మధ్య మాట పట్టింపునకు కారణమవుతుంది. దీంతో ఐదేళ్లపాటు ఇరువురూ విడివిడిగా జీవించి, ఆ తరువాత కలుసుకుందామని నిర్ణయించుకుంటారు. పట్నం చేరిన గోపి ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలుడవుతాడు. మంచికి పోగా చెడు ఎదురవటంతో అనుకోకుండా ఓ నేరంలో చిక్కుకోబోవటం, దాన్నించి తనను రక్షించిన గజదొంగ పశుపతి (నాగభూషణం)ని విడిపించే ప్రయత్నంలో తానే పెద్ద నేరస్తుడిగా, గజదొంగ గంగారాంగా మారడం జరుగుతుంది. పశుపతి చెల్లెలు మీనా (గీతాంజలి) గంగారాంను ఇష్టపడుతుంది. వేరే వూరుచేరిన శ్రీను అనుకోకుండా గోపి తల్లిని, చెల్లెలు ఇందిర (విజయనిర్మల)ను కలుసుకుంటాడు. వాళ్లింట అవుట్‌హౌవుస్‌లో ఉంటున్న మాలోకం (చలం) గదిలో ఆశ్రయం పొందుతాడు. అలా ఇందిర ప్రేమను, ఇన్‌స్పెక్టరుగా ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. గంగారాంను అరెస్ట్ చేయటానికి స్పెషల్ డ్యూటీమీద శ్రీను హైద్రాబాదు వస్తాడు. అయితే, తల్లి మరణించటంతో ఇందిర కూడా హైద్రాబాదులోని గంగారాం వద్దకు చేరుకుంటుంది. గంగారాం ప్రయత్నాలను శ్రీనివాస్‌గా విఫలం చేస్తుంటాడు. ఆక్రమంలో ఐదేళ్ల అనంతరం తమ సంకేత స్థలంలో కలుసుకున్నపుడు, ఎవరెవరో నిజం తెలిసికోవటం జరుగుతుంది. తరువాత గంగారాంను బంధించాలని శ్రీనివాస్, శ్రీనివాస్‌ను అంతం చేయాలని గంగారాం.. ఇద్దరూ బుల్లెట్ లేని తుపాకీలతో రావటం, మరో పోలీసు కాల్చిన తూటాతో గంగారాం గాయపడగా, మిత్రులిద్దరూ ఒకరినొకరు కౌగలించుకొని దుఃఖించటం, గంగారాం మరణించటంతో చిత్రం ముగుస్తుంది. చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా, రౌడీగా త్యాగరాజు, ఇంకా జగ్గారావు, పిజె శర్మ, నవీన లక్ష్మి, జయకుమారి ఇతర పాత్రలు పోషించారు.
సమర్ధుడైన దర్శకునిగా రాణించిన తాతినేని రామారావు -మంచి మిత్రులు చిత్రాన్ని ఆసక్తికర సన్నివేశాలతో తీర్చిదిద్దారు. ఒకే రూములో తనతోవున్న శ్రీనుకు, ఆకలికి తట్టుకోలేవంటూ గోపికి ఆప్యాయంగా భోజనం పెట్టడం, అన్యాయంగా తనకి మరొకరి పని అప్పచెప్పినందుగా నిరసనగా గోపి ఉద్యోగం వదిలిపెట్టడం, రాజీపడని అతని స్వభావాన్ని శ్రీను, శ్రీను లక్షణాలను గోపి ఒకరినొకరు నిందించుకొని ఆంజనేయుని విగ్రహంముందు ఇద్దరూ విడిపోవటంలాంటి సన్నివేశాలను ఆసక్తిదాయకంగా తీర్చిదిద్దారు. ఐదేళ్ల తరువాత ఎంతో ఆర్ద్రంగా, బాధగా ఒకరినొకరు కలుసుకున్న దృశ్యాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. పట్నంవెళ్ళిన గోపి తొలుత అమాయకత్వంతో ఖాళీ పర్సు యజమానికి అందజేసి నింద పొందటం, స్నేహితుడు ప్రకాష్ తనను దొంగ సారా కేసులో ఇరికించటం, పశుపతి కోసం వారిని ఎదిరించి గజదొంగగా (కారు చక్రాలపై దొంగతనాలు, దోపిడీలను చిత్రీకరించి చూపించి దర్శకుడి క్రియేటివిటీ) చూపటం, క్రయిమ్ చిత్రాల్లోని సన్నివేశాల మాదిరిగా మీనా కారు నడుపుతూ వచ్చి శ్రీనును బంధించబోవటం, ఆమెను అడ్డుపెట్టుకొని శ్రీను తప్పించుకోవటం, మరోసారి క్లబ్‌లో మారువేషంలో దొంగల ముఠాకోసం ప్రయత్నించటం, తనని బంధించవచ్చిన ఆఫీసర్ తన సాయంతో ఉద్యోగం సంపాదించిన వ్యక్తిని వివాహం చేసుకోవద్దని గంగారాం చెల్లిని శాసించటం.. ఇలా క్రైమ్ సీన్లు, సెంటిమెంటు, మధ్యలో శ్రీను ఇందిరల వలపు, నవీన లక్ష్మి, చలం, జగ్గారావుల మధ్య కొంత హాస్యంతో చిత్రాన్ని ఆసక్తిదాయకంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మిత్రులిద్దరూ కలుసుకునే సన్నివేశంలో వచ్చే గీతంలో వారిరువురి పాత్రల లక్షణాలను లౌకికంగా విశే్లషించారు. ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం/ ఈనాడే ఎదురవుతుంటే -అంటూ సి నారాయణరెడ్డి వ్రాసిన గీతాన్ని ఘంటసాల కృష్ణకు, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం శోభన్‌బాబుకు పాడారు. ఈ పాటలో హీరోలిద్దరూ ఒకరికోసం ఒకరు వచ్చేదారులను తెరపై బిజీయమ్స్ వచ్చే గమకాలకు తగ్గట్టు అర్ధవంతంగా చిత్రీకరించటం విశేషం. అలాగే మిత్రులిద్దరూ ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకోవాలనుకోవటం చిత్రం టైటిల్ సార్ధకమయ్యేలా చిత్రీకరించారు.
చిత్రంలో కృష్ణ గోపిగా, గంగారాంగా రెండు పాత్రల వైవిధ్యాన్ని అలవోకగా ప్రదర్శించారు. అందుకు తగ్గట్టు శోభన్‌బాబు తొలుత శ్రీనుగా ఆపైన శ్రీనివాస్‌గా నటనలో పరిపూర్ణత చూపారు. ఇందిరగా విజయనిర్మల తొలుత చిలిపి, అల్లరితనం, ఆపైన నిండుదనం, గాంభీర్యాన్ని పాత్రోచితంగా ప్రదర్శించారు. ఇక గీతాంజలి మీనాగా పాత్రకు తగిన ప్రశంసనీయ నటన ప్రదర్శించారు.
చిత్రంలోని ఇతర గీతాలు:
గీతాంజలిపై చిత్రీకరించిన క్లబ్ సాంగ్ -ఎంతో ఉన్నది అంతు తెలియనిది (గానం: పి సుశీల), జయకుమారిపై చిత్రీకరించిన క్లబ్ సాంగ్ -అరె నిషా నిషా మజామజా నీకు కావాలా (గానం: పి సుశీల), విజయనిర్మల, శోభన్‌బాబు బృందంపై చిత్రీకరించిన బాస్కెట్‌బాల్ గీతం -4 వైపుల గిరిగీసి ఆపై సన్నని తెరవేసి (గానం: పి సుశీల, ఎస్పీ బాలు), శోభన్‌బాబు, విజయనిర్మలపై యుగళ గీతంగా చిత్రీకరించిన -ఓరచూపులు చూడకముందే ఒళ్లు ఎందుకే ఝల్లుమనే (గానం: ఎస్పీ బాలు, పి సుశీల, రచన: ఆరుద్ర) అలరిస్తాయి.
మంచిమిత్రులు చిత్రం విజయం సాధించింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం గీతం -సన్నివేశం మూలంగా మంచి మిత్రులెవరికయినా గుర్తుగా నిలిచిపోయింది. కేవలం ఒక్క గీతంతో ఆ చిత్రం మరువరాని చిత్రంగా ప్రేక్షకుల మదిలో చక్కని అనుభూతులను కలిగించటం ప్రత్యేక విశేషాంశం. తమిళ, హిందీ చిత్రాల్లోనూ ఈ పాట ప్రత్యేకత కలిగి వుండటం మరో విశేషం. మరపురాని స్నేహచిత్రాన్ని నిర్మించిన నిర్మాత మల్లికార్జున రావు అభినందనీయులు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి