ఫ్లాష్ బ్యాక్ @ 50

భాగ్యదేవత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారథి పిక్చర్స్ ప్రై లిమిటెడ్ వ్యవస్థాపకుడు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్. అభ్యుదయభావాలు కలిగిన విద్యాధికులు. వారి ఆలోచనలు చిత్ర నిర్మాణంవైపు మళ్లడంతో తొలిసారి తాపీ చాణక్య దర్శకత్వంలో వల్లం నరసింహారావును హీరోగా పరిచయం చేస్తూ 1954లో ‘అంతా మనవాళ్లే’ సినిమా రూపొందించారు. సినిమా పూర్తిగా మద్రాస్‌లోనే నిర్మించారు. తరువాత ‘రోజులు మారాయి’ (1955), ‘పెద్దరికాలు’ (1957), ‘ఎత్తుకు పైఎత్తు’ (1958) సినిమాలు రూపొందిన తరువాత, వీరు సారథి స్టూడియో బ్యానర్‌పై భాగ్యదేవత చిత్రాన్ని 1959లో నిర్మించారు.
రోజులు మారాయి సినిమా సికింద్రాబాద్‌లో వంద రోజులు ఆడింది. చిత్ర శత దినోత్సవ సభకు హాజరైన రెవిన్యూమంత్రి కెవి రంగారెడ్డి -తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావాలని కోరారు. దాంతో హైదరాబాద్‌లో సారథి స్టూడియో నిర్మింపబడింది. స్టూడియోలో చిత్రీకరించిన తొలి చిత్రం నవశక్తివారి ‘మా ఇంటి మహాలక్ష్మి’. తరువాత సారథి స్టూడియో నిర్మించిన చిత్రం -్భగ్యదేవత. ఈ చిత్రాన్ని తమిళంలో ‘్భగ్యదేవతై’గా నిర్మించారు. తమిళ వర్షన్ సైతం తెలుగు రాజధాని హైదరాబాద్‌లో నిర్మించటం ఆ రోజుల్లో ఓ విశేషం. తరువాత ‘కుంకుమ రేఖ’, ‘పుదియపాదై’ (తమిళం), ‘కలసి ఉంటే కలదు సుఖం’, ‘ఆత్మబంధువు’ తదితర చిత్రాలు రూపొందించారు.
తమిళ చిత్రం ‘్భగ్యదేవతై’ జూన్ 12, 1959న విడుదలైంది. ఈ చిత్రంలో జెమిని గణేశన్, సావిత్రి, బాలయ్య, రాజసులోచన, నంబియార్ ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకత్వం తాపీ చాణక్య నిర్వహించగా, మాస్టర్ వేణు సంగీతం, తాన్‌జాయ్ ఎన్ రామయ్య దాస్ స్క్రీన్‌ప్లే అందించారు.
భాగ్యదేవత తెలుగు చిత్రం అక్టోబర్ 23, 1959న విడుదలై ఆరవైయేళ్లు పూర్తి చేసుకుంది.
కథ, సంభాషణలు: తాపీ ధర్మారావు
సంగీతం: మాస్టర్ వేణు
నృత్యం: విజె శర్మ
కళ: వి సూరన్న
ఛాయాగ్రహణం: యూసఫ్ ముఖర్జీ
ఎడిటింగ్: ఎ సంజీవ్
అసోసియేట్ దర్శకులు: జి కబీర్‌దాస్
ప్రొడక్షన్ ఇన్‌ఛార్జి: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాత: వై రామకృష్ణప్రసాద్.

కీశే జడ్జి భార్య నిర్మలమ్మ. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లలిత (రాజసులోచన), చిన్న కుమార్తె సరళ (సావిత్రి). లలితకు తన మిత్రుడైన తాసీల్దారు (పెరుమాళ్లు) కుమారుడు గిరితో పెళ్లి జరిపించమన్న భర్త కోరికమేరకు -లలిత గిరిల పెళ్లి నిశ్చయిస్తుంది నిర్మలమ్మ. మెడిసన్ చదివిన లలిత ఆ పెళ్లిని వ్యతిరేకించి, తాను ప్రేమించిన మూర్తి (బాలయ్య) వద్దకెళ్లి అతన్ని గుళ్లో పెళ్లి చేసుకుంటుంది. తండ్రి కోరిక, కుటుంబం పరువూ నిలపాలని ఆలోచించిన చిన్న కుమార్తె సరళ -తల్లిని, పెళ్లివారిని, గిరిని ఒప్పించి అదే ముహూర్తానికి గిరిని పెళ్లి చేసుకుంటుంది. లలిత -మూర్తి ఆనందంగా జీవిస్తుంటారు. తనను నిరాకరించి అవమానించిందని లలితపై కోపం పెంచుకున్న గిరి -ఆమె ఇంటికి తరచూ వస్తూ చనువు ప్రదర్శించి... భర్త మూర్తిలో అనుమానం రేకెత్తిస్తాడు. లలితను అనుమానించిన మూర్తి ఆమెను మాటలతో హింసించగా, ఇల్లు వదిలిన లలిత.. కంపౌండర్ గోపాలం (రేలంగి) సాయంతో మగవేషంలో డాక్టరుగా మూర్తివద్దే పనిచేస్తూ తన విషయం చెల్లెలు సరళకు చెప్పుకుంటుంది. దీనికి తన భర్త కారణమని గ్రహించిన సరళ -లలిత కాపురం సరిదిద్దమని భర్తను వేడుకుంటుంది. గిరి తిరస్కరిస్తాడు. ఈలోగా గిరి చేతిలో తుపాకీ పేలి ఒక వ్యక్తి గాయపడతాడు. అయితే గిరి నేరాన్ని సరళ తనమీద వేసుకుని జైలుకెళ్లటంతో గిరిలో మార్పు వస్తుంది. మూర్తివద్దకు బయలుదేరుతూ దారిలో యాక్సిడెంట్‌కు గురవుతాడు. హాస్పిటల్‌లో గిరికి వైద్యం చేయటానికి మూర్తి నిరాకరించటంతో, లలిత అతన్ని కాపాడుతుంది. జామీనుమీద వచ్చిన సరళ అందరికీ నిజం చెప్పటం, అప్పటికే మరోసారి భర్త తిరస్కారానికి గురై లలిత ఆత్మహత్యకు యత్నించటం, స్పృహలోకి వచ్చిన గిరి.. మూర్తిని క్షమాపణకోరి నిజం వెల్లడించటంతో మూర్తిలో మార్పు వస్తుంది. రైలు క్రింద పడబోయిన లలితను -మూర్తి, సరళ అంతాకలిసి కాపాడటం.. ఈ సంసార కథ ఈవిధంగా సుఖంగా నడవడానికి కారణం సరళ మంచితనం, లక్షణాలు అంటూ ఆమె తమపాలిటి ‘్భగ్యదేవత’ అని అందరూ ప్రశంసించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
సినిమాలో బాలయ్య, రాజసులోచన ఉన్న బస్సులో ఓ ప్రయాణికునిగా తమిళ హీరో జెమిని గణేశన్ కనిపిస్తారు. ఇంకా ఇతర పాత్రల్లో కొండలరావు, ఎకె రావు, సీతారాం, కె వెంకట్రామయ్య, లక్ష్మీమాధురి, వాణి, సుశీల నటించారు.
1952లో విజయనగరంలో జన్మించిన తాపీ చాణక్య -ప్రముఖ తెలుగు సాహితీ సినీ రచయితగా ప్రసిద్ధులైన తాపీ ధర్మారావు కుమారుడు. 1947నుంచి శోభనాచల స్టూడియోలో శబ్దగ్రహణశాఖలో, తరువాత పల్లెటూరిపిల్ల చిత్రానికి దర్శకత్వశాఖలో పనిచేసిన వీరు ‘సారథి’వారి ‘అంతామనవాళ్లే’ చిత్రం ద్వారా దర్శకులయ్యారు. మొత్తంగా 17 తెలుగు చిత్రాలు, 8 తమిళ, 5 హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సారథి సంస్థకు ఆరు చిత్రాలు -అంతామనవాళ్లే, రోజులుమారాయి, పెద్దరికాలు, ఎత్తుకు పైఎత్తు, భాగ్యదేవత, కలసి ఉంటే కలదు సుఖం పని చేశారు. ఎత్తుకు పైఎత్తు చిత్రం ద్వారా బాలయ్యను హీరోగా పరిచయం చేశారు.
వీరి దర్శకత్వంలో తమిళం, తెలుగు భాషల్లో భాగ్యదేవత రూపొందింది. తరువాతి కాలంలో ‘రాముడు-్భముడు’ తెలుగు చిత్రాన్ని తమిళం, హిందీలోనూ వీరే దర్శకత్వం వహించటం (వేరు వేరు సమయాల్లో రూపొందిన ఎంగవీటపిళ్లె, రామ్ ఔర్ శ్యామ్‌లు ఘన విజయం సాధించాయి) తాపీ చాణక్య ప్రతిభకు నిదర్శనం.
వీరి దర్శకత్వంలో రూపొందిన భాగ్యదేవత చిత్రంలో 60ఏళ్ల క్రిందటి కుటుంబ వాతావరణం, వారి మనోభావాలు, ప్రేమలు, పెళ్లిళ్లు, అత్తగారి ఆరళ్లు, ఆడవారిపై ఆంక్షలు.. ఏ తీరున ఉండేవన్నది సన్నివేశాల్లో కళ్లకు కట్టినట్టు చూపించారు. విద్యాధికురాలైన లలిత, శాంతంతో సమస్యలు పరిష్కరించే సరళలవంటి స్ర్తిలను దృష్టిలో వుంచుకుని ఎంతో బలంగా సన్నివేశాలు రూపొందించటం చాణక్య ప్రతిభకు నిదర్శనం. లలిత ఇల్లు వదిలి వెళ్లగా, సరళ ఎంతో ఉన్నతంగా తమ కుటుంబం గురించి, బిఏ చదివానని ఎంతో సౌమ్యంగా అందరినీ ఒప్పించేలా మాట్లాడ్డం, తనంతటతాను పెళ్లి జడ వేసుకోలేక తల్లిని నన్ను పెళ్ళికూతుర్ని చెయ్యమన్న అని అడగటం, అత్తగారి ఆరళ్లు ఎంతో సహనంతో భరించటం, చివరలో అక్కను బలవంతం చేయబోయిన భర్తను నివారించటం, దైవాన్ని ప్రార్థించటం, భర్తబదులు తానే జైలుకు వెళ్ళసిద్ధపడడం, ఎంతో ధైర్యంతో తానే పిస్టల్ పొరపాటున పేల్చానని చెప్పటం, క్లైమాక్స్‌లో హాస్పిటల్లో మూర్తి తన అక్కను చెడుగా మాట్లాడటంతో.. ఎంతో ఆవేశంగా అతనికి నిజాలు వెల్లడించటం పాత్ర తీరును అద్భుతంగా మలిచారు దర్శకులు. అదేవిధంగా అతిశయం, అణుకువవున్నా ఆవేశంతో భర్తను ఎదిరించిన లలిత, తిరిగి తన ప్రవర్తనకు బాధపడి భర్తకు దగ్గరవ్వాలని ప్రయత్నించటం, విఫలమవుతున్నానని చెల్లితోచెప్పి బాధపడటం, తల్లి నిర్మలమ్మ కూతుళ్ల గురించి బాధ, సూర్యాకాంతం అత్తగారి ఆరళ్లు, మధ్యలో రేలంగి భార్యతో హరిదాసుగా, కాంపౌండర్‌గా ఆసుపత్రిలో రిలీఫ్ సన్నివేశాలలో హాస్యం.. ఇలా పలు విధాలుగా సన్నివేశాలు రూపొందించి ప్రేక్షకులను మెప్పించారు. బాలయ్య, జగ్గయ్య తమ పాత్రల వైవిధ్యాన్ని పోషణలో చక్కగా చూపటంతో ఓ చక్కని కుటుంబ కథాచిత్రంగా, మహిళల మన్నన పొందిన సినిమాగా ‘్భగ్యదేవత’ నిలిచింది.
మాస్టర్ వేణు సంగీతంలో ఈ చిత్రంలో గీతాలు కొన్ని నేటికీ అలరించేలా నిలిచాయి. వాటిలో ‘రాజసులోచన, బాలయ్యల మీద వారి వివాహమయ్యాక ఇంటిలో చిత్రీకరించిన గీతం -తలచిన తలపులు, ఫలమైతే తీయని కలలే (గానం: కె జమునారాణి, రచన: కొసరాజు). ఆరుబయట జాబిల్లిని చూపిస్తూ సాగే సావిత్రి, జగ్యయ్యలపై తొలిరేయి గీతం -మదిని హాయి నిండెగా/ విబుడు చెంతనుండగా (గానం: సుశీల, ఘంటసాల, రచన: శ్రీశ్రీ). మరో శ్రీశ్రీ రచన బాలయ్య, రాజసులోచనపై చిత్రీకరణ -వెతుకాడే కన్నులలోన వెలిగించి (గానం: ఘంటసాల, కె జమునారాణి). సాధువు వేషంలో రేలంగిపై చిత్రీకరించిన గీతం -హరే హరే రాం, సీతారాం, అంతా ఇంతే ఆత్మారాం (గానం: ఘంటసాల, రచన: కొసరాజు). మిగిలిన గీతాల్లో సావిత్రిపై చిత్రీకరించిన -ఓ మాతా ఎటుచూసినా చీకటేనా (గానం: సుశీల, మాధవపెద్ది బృందం, రచన: తాపీ ధర్మారావు). ధర్మారావుదే మరో రచన సావిత్రి, రాజసులోచనపై చిత్రీకరణ -మరికొంచెం నిద్దుర కానీ (గానం: సుశీల). కొసరాజు రచన, రాజసులోచన బృందం నృత్య గీతంగా.. పల్లెవేషం, రాధాకృష్ణుల నృత్యం, శివపార్వతుల నృత్యంతో అలరించేలా చిత్రీకరించిన -బావంటే బావ బలే మంచి బావ (గానం: కె జమునారాణి బృందం). తాపీ ధర్మారావు మరో రచన -పాపం ఒకచోట ఫలితం ఒకచోట (గానం: మాధవపెద్ది)

-సీవీఆర్ మాణిక్యేశ్వరి