బిజినెస్

కరెన్సీ విలువల మార్పుతో పెరిగిన ఫారెక్స్ నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: బంగారం విలువ తగ్గినప్పటికీ డాలరుతో యూరో విలువ భారీగా పెరిగిన కారణంగా భారత విదేశీ కరెన్సీ నిల్వలు 48.32 కోట్ల డాలర్ల మేర పెరిగాయని నిపుణులు అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ప్రతివారం విడుదల చేసే గణాంకాల అనుబంధం ప్రకారం డిసెంబర్ 4తో ముగిసిన వారంలో మన విదేశీ కరెన్సీ నిల్వలు 352.09 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నవంబర్ 27తో ముగిసిన అంతకు ముందు వారంలో ఈ నిల్వలు 75.02 కోట్ల డాలర్ల మేర తగ్గి 351.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కరెన్సీ విలువల్లో భారీ మార్పులు బంగారం ధరలు తగ్గుదలను మించి ప్రభావం చూపించాయని కోటక్ సెక్యూరిటీస్‌లో కరెన్సీ డెరివేటివ్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అనింద్య బెనర్జీ అభిప్రాయ పడ్డారు.
గడచిన వారంలో డాలరుతో యూరో విలువలో భారీ ర్యాలీ కనిపించింది, డిసెంబర్ 3న జరిగిన యూరో సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధానం సమీక్షకు ముందు డాలరుతో యూరో విలువ దాదాపు 3 శాతం పెరిగింది అని ఆయన చెప్పారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసిబి) మరో దఫా పెద్ద ఎత్తున తన బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమం చేపట్టవచ్చన్న అంచనాల ఫలితంగా యూరో విలువ భారీగా పెరిగిందని ఆయన చెప్పారు. ఇసిబి తన డిపాజిట్లపై వడ్డీ రేటును 19 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో పాటుగా తన బాండ్ల కొనుగోలు కార్యక్రమాన్ని 2016 మార్చి 17 దాకా పొడిగించింది. యూరోతోనే కాకుండా అమెరికా డాలరు పౌండ్ స్టెర్లింగ్, యెన్‌లాంటి ప్రధాన విదేశీ కరెన్సీల విషయంలోను తగ్గింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, అలాగే రిజర్వ్ బ్యాంక్ డాలర్ల కొనుగోలు కార్యక్రమాలు కూడా మన విదేశీ కరెన్సీ నిల్వలు పెరగడానికి దోహదపడ్డాయని ఆనంద్ రథీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో కరెన్సీ అడ్వైజరీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హిరేన్ శర్మ చెప్పారు.