గుంటూరు

దళితులపై వైఎస్ కుటుంబం కపటప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 22: దళితులపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, కుటుంబసభ్యులు కపటప్రేమ ఒలకబోస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు విమర్శించారు. మంగళవారం టిడిపి రాష్ట్ర కార్యాలయంలో విలేఖర్లతో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత బైబిల్‌ను చేతపట్టి ఖూనీలుచేసే వారికి లేదన్నారు. ఓట్లకోసం నక్కజిత్తులు వేస్తున్న వారి పట్ల దళిత క్రైస్తవులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దళితులకు న్యాయం చేసామంటున్న ప్రతిపక్ష పార్టీలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైఎస్ హయాంలో దళితులు, దళిత క్రైస్తవులను ఓటుబ్యాంక్‌గా వాడుకున్నారని ధ్వజమెత్తారు. దళిత క్రైస్తవులను ఎస్సీలలో చేరుస్తామని సిఎం ప్రకటించటాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎందుకు తప్పుపడుతున్నాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో పక్కదారి పట్టించిందని విమర్శించారు. తమ ప్రభుత్వం వెయ్యికోట్ల నిధులతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. జెరూసలెం యాత్రకు దళిత క్రైస్తవులు కూడా అర్హులే అన్నారు. దళితులకు వర్తించే సంక్షేమ పథకాలు వారికీ వర్తిస్తాయని చెప్పారు. జెరూసలెం యాత్రను పునరుద్ధరించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుచ తప్పక నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.

చిన్న నోట్లను చలామణిలోకి తేండి
* సిపిఐ నేతల డిమాండ్
సత్తెనపల్లి, నవంబర్ 22: చిన్ననోట్లను వెంటనే చలామణిలోకి తెచ్చి, ప్రజల అవసరావలను తీర్చాలని పట్టణ సిపిఐ నాయకులు మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ముందు ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దూళ్లిపాళ్ళ బ్యాంక్ చైర్మన్ నరిసేటి గురవయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంవల్ల సామాన్యులు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జన్‌ధన్ పథకం కింద ప్రతి అకౌంటుకు కనీసం రూ.15,000 రూపాయలు జమచేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కంభాల శ్రీనివాస్, అమృత సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు టి కళ్యాణ చక్రవర్తి, షేక్ జాని, సొసైటీ న్యాయ సలహాదారుడు ఎన్ వేణుగోపాల్, ఎఐటియుసి ఏరియా ప్రధాన కార్యదర్శి పి రామకోటయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం బ్యాంకు మేనేజర్ చిల్లర నోట్ల పంపిణీ వేగవంతం చేస్తామని హామీని ఇచ్చారు. పట్టణ ఎస్సై భుజంగరావు తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.