గుంటూరు

విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 22: సమాజంలో విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో రాణించాలని సాంఘిక సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక పోలీసు పెరెడ్‌గ్రౌండ్‌లో జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగస్వాములై సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజంలో దేన్నైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల అభివృద్ధికి వినియోగిస్తున్న ఉప ప్రణాళిక నిధులను విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికీ వినియోగించడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఇతరులపై ఆధారపడకుండా తమంతట తాముగా ఆర్థికంగా నిలబడే స్థాయికి విభిన్న ప్రతిభావంతులు ఎదగాలని ఆకాంక్షించారు. జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, నామినేటెడ్ శాసనసభ్యులు ఫిలిప్ సి ధాచర్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, దాక్షిణ్య వ్యవస్థాపకుడు టివి రావు ప్రసంగించారు. తొలుత అతిథులు క్రీడా పతాకాలను ఆవిష్కరించి, బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. కార్యక్రమంలో జెసి 2 ముంగా వెంకటేశ్వరరావు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకుడు అచ్యుత రామయ్య, జిల్లా నలుమూలల నుండి వివిధ సంస్థలకు చెందిన విభిన్న ప్రతిభావంతులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తన బాధితులకు పరిహారం అందించాలి
* చివరి భూములకు నీరందేలా చూడాలి
* వైసిపి నేతల డిమాండ్ ... జెసికి వినతిపత్రం
గుంటూరు, నవంబర్ 22: జిల్లాలో నకిలీ మిరప విత్తనాల బారినపడి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు తక్షణం పరిహారం అందించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పలువురు నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు జాయింట్ కలెక్టర్ క్రితికాశుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తదితరులు మాట్లాడుతూ జిల్లాలోని పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో రైతులు నకిలీ మిరప విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అప్పట్లో ఈ విషయమై ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే ఇప్పటివరకు ఆ దిశగా ప్రయత్నాలేవీ జరగలేదని, తక్షణమే వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కాగా నాగార్జున సాగర్ కాల్వ చివరి భూములకు ఇప్పటికీ నీరు అందడం లేదన్నారు. అయితే తాజాగా కాల్వకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారని తెలిపారు. తక్షణం రైతుల సంక్షేమం దృష్ట్యా నీటి సరఫరాను పునరుద్ధరించి కాల్వ చివరిలోని ప్రతి ఎకరానికి నీరు అందేలా చూడాలని కోరారు. వాగులపై ఉన్న లిఫ్ట్‌ల ద్వారా నేటికీ ఒక ఎకరా భూమికి కూడా నీరు రాలేదని, ఈ దృష్ట్యా వాగుల్లోకి నీళ్లు వదిలి లిఫ్ట్‌ల ద్వారా పొలాలకు అందించి పంటలు కాపాడాలని విజ్ఞప్తిచేశారు. జెసిని కలిసిన వారిలో ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా, నాయకులు మేరుగ నాగార్జున, జంగా కృష్ణమూర్తి, కత్తెర హెనీ క్రిస్టీనా, కావటి మనోహర్‌నాయుడు, కె రోశయ్య, డైమండ్ బాబు, కొత్తా చిన్నపరెడ్డి, ఉప్పుటూరి నర్సిరెడ్డి, బండారు సాయిబాబు తదితరులున్నారు.