గుంటూరు

డైట్, డిఈడీ అంతర కళాశాలల యువజనోత్సవాలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, డిసెంబర్ 2: డైట్, డిఈడీ అంతర్ కళాశాలల యువజనోత్సవాలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ఏపీ ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రొఫెసర్ యంవీ రాజ్యలక్ష్మి అన్నారు.
శుక్రవారం స్థానిక యంవియం అండ్ డాక్టర్ కెఎస్‌పిఆర్ కళాశాలలో యువజనోత్సవాలు-2016 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు అధ్యక్షత వహించారు.ఇలాంటి యువజనోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా నరసరావుపేట యంవియం కళాశాలలో జరగడం అభినందనీయమన్నారు. రాష్టస్థ్రాయి పోటీలను ఇదే కళాశాలలో నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు. రాష్టస్థ్రాయి పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. క్రీడలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఫిజికల్ ఎడ్యుకేన్ ఉండేదని, దాని స్థానంలో ఫిజికల్ లిటరసీగా పేరుమార్చి వెంటనే ఉత్తర్వులు అందిస్తామన్నారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలన్నారు. ఆటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొని, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్నారు. గుంటూరు జిల్లాలో 70 డిఈడీ కళాశాలలు ఉండగా, 40 కళాశాలల నుండి సుమారు వెయ్యి మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. రెండు రోజులు విద్యార్థులకు అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామని చైర్మన్ శేషగిరిరావు చెప్పారు.
ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు నాసరయ్య, నాతాని వెంకటేశ్వర్లు, బొల్లా కోటేశ్వరరావు, రాఘవులు, ప్రిన్సిపల్స్ శ్రీనివాసరావు, రవీంద్ర, మంగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం విద్యార్ధినీ, విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, బాల్‌బాట్మింటన్, త్రోబాల్, టెన్నికాయిట్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, లాంగ్‌జంప్ తదితర పోటీలను నిర్వహించారు.