గుంటూరు

కార్మిక నేత జివికి అశ్రు నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 2: సిపిఐ సీనియర్ నేత జివి కృష్ణారావు అంతిమయాత్ర శుక్రవారం స్థానిక సంగడిగుంటలోని జివి స్వగృహం నుండి ఏటుకూరు రోడ్డులోని హిందూ శ్మశానవాటిక వరకు జరిగింది. యాత్రలో సిపిఐ జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, రామకృష్ణతో పాటు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, బిజెపి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి రాయపాటి సాంబశివరావు, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌కుమార్, మక్కెన మల్లికార్జునరావు, అప్పిరెడ్డి, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, బిజెపి, ఇతర అనుబంధ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో కార్మికులు, పార్టీ సానుభూతి పరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకు నిరంతరం పోరాటాలు చేసిన ధీరుడు జివి అని కొనియాడారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కార్మిక నేత జివి కృష్ణారావు మృతి కార్మిక వర్గానికి తీరని లోటన్నారు. విద్యార్థి దశ నుండే ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, చివరకు ఉపాధ్యాయ వృత్తిని కూడా వదిలి కార్మికుల సమస్యల పరిష్కారానికే జీవితం అంకితం చేశారని నివాళులర్పించారు.
కార్యకర్తలు కష్టపనిచేయాలి
బెల్లంకొండ, డిసెంబర్ 2: కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎన్నటికీ అన్యాయ జరగదని, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు అన్నారు. శుక్రవారం బెల్లంకొండలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశం ఆర్ధికలోటుతో 60 యేళ్ల వెనక్కు వెళ్లే పరిస్థితులు దాపురించాయన్నారు. నేడు బిజెపి తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరి కష్టాలు తీర్చాలంటే ఇలాంటి ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలన్నారు. ఇందుకు ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ సాతులూరి రామాంజనేయులు, మండల అధ్యక్షుడు భూక్యా సీతారాంనాయక్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.