గుంటూరు

ఆదర్శ నియోజకవర్గంగా సత్తెనపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సతైనపల్లి, డిసెంబర్ 2: సత్తెనపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో తలపెట్టిన అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తున్నామన్నారు. అవసరమైన అభివృద్ధి పనులన్నిటికీ శంఖుస్ధాపనలు చేస్తున్నామన్నారు. ‘చెప్పండి మీ గ్రామానికి ఇంకా ఏమికావాలి’ అని ప్రజలను ప్రశ్నించారు. శుక్రవారం సతైనపల్లి మండలంలోని గుజ్జర్లపూడి, కట్టమూరు, లక్కరాజు, గార్లపాడు గ్రామాల్లో ఆర్ అండ్ బి రోడ్ల పునర్ నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమాల్లో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న సతైనపల్లి - బయ్యవరం రోడ్ల ప్రత్యేక మరమ్మతు పనులను గుజ్జర్లపూడి గ్రామంలో ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కట్టామూరు గ్రామంలో 2 కోట్ల రూపాయలతో నిర్వహించనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామ ఎస్సీ కాలనీలో అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించాలని కాలనీ వాసులు స్పీకర్‌ను కోరారు. దానికి స్పీకర్ వారికి హామీ ఇచ్చారు. గార్లపాడు గ్రామంలో సతైనపల్లి నుండి నుదురుపాడు రైల్వే స్టేషన్ రోడ్డు కిమీ 0/400 నుండి 3/600 వరకు అదేవిధంగా ఇదే రోడ్డులో 5/083 కిమీ 9/0 వరకు, అభివృద్ధి పరచుట, తొండపి నుండి హైదరాబాద్ - గుంటూరు రోడ్డు కిమీ 0/0 నుండి 4/770 వరకు 1 కోటి 50 లక్షల రూపాయలతో చేపట్టే పనులకు శంఖుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, ఎంపీపీ బొర్రా కోటేశ్వరరావు, కోమటినేని శ్రీనివాసరావు, పుష్పరాజ్ సోలనంబి, మక్కపాటి రామచంద్రరావు, పోపూరి కృష్ణరావు, పూజల వెంకట కోటయ్య, భీమనేని వందనాదేవి, తుమ్మల ఏడుకొండలు, ఆలోకం పూర్ణచంద్రరావు, పాకాలపాడు తొరటి వెంకట్రావు, పుట్టి చలపతిరావు, మందడి శ్రీనివాసరావు, మందడి కాళీప్రసాద్, కొణికినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ కట్టడాల కూల్చివేత

రేపల్లె, డిసెంబర్ 2: పట్టణంలో నిబంధనలకు విరుద్దంగా సెల్లార్లు నిర్వహిస్తున్న వివిధ వ్యాపార సంస్థలను కమిషనర్ మారుతీ దివాకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్మికులు పోలీసుల సహకారంతో యంత్రాల ద్వారా కూల్చివేశారు. శుక్రవారం స్థానిక నెహ్రూవిగ్రహం సెంటర్‌లోని వంశీరెసిడెన్సీ బహుళ అంతస్తు, వైపిఆర్ కాంప్లెక్స్ కింద నిర్వహిస్తున్న అమృత హోటల్, వ్యాపార సంస్థలను ఖాళీ చేయించి షాపులను తొలగించివేశారు. అలాగే ప్రవీణ్‌ప్లాజాలోని జీన్స్ కార్నర్, రెడీమేట్ వ్యాపారసంస్థలను కూల్చివేశారు. గత రెండు నెలల క్రితమే షాపులను అద్దెకు ఇచ్చిన యజమానులకు మున్సిపల్‌శాఖ నుండి నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ యజమానులు, నిర్వాహకులు స్థానిక ఎమ్మెల్యే సత్యప్రసాద్, చైర్మన్ శ్రీనివాసరావులను కలిసి దుకాణాలు ఖాళీ చేయించేందుకు కొంత సమయం కావాలంటూ విన్నవించుకున్నారు. వారి విఙ్ఞప్తుల మేరకు కొంతగడువు ఇచ్చినా యజమానులు, వ్యాపారులు స్పందించక పోవటంతో ఈనిర్ణయం తీసుకున్నారు. ముఠాకార్మికులు, మున్సిపల్ సిబ్బంది శుక్రవారం దుకాణాలను కూల్చివేశారు. దీంతో భవన యజమానులు, వ్యాపారులు కమిషనర్‌తో వాగ్వివాదానికి దిగానా కార్యక్రమాన్ని కమిషనర్ ఆపలేదు. దీంతో తమవ్యాపారాలు కోల్పోయామని యజమానులు వాపోతున్నారు.