గుంటూరు

ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుంటే ఆందోళన ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 2: తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేసే వరకు ప్రజా పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి కృష్ణయ్య పేర్కొన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన మహాధర్నాకు జిల్లా పార్టీ సెక్రటేరియట్ సభ్యులు జెవి రాఘవులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్లస్థలాలు, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 2 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవని, మరో లక్ష కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేయలేదన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ గత 20 రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా సిపిఎం 18 బృందాలుగా ఏర్పడి 456 గ్రామాలు, 13 పట్టణాల్లోని 225 వార్డుల్లో పాదయాత్రలు చేపట్టి ప్రజా సమస్యలను అధ్యయనం చేసిందన్నారు. జిల్లాలో ఇళ్లస్థలాలు, పట్టాల సమస్య తీవ్రంగా ఉన్నట్లు వెల్లడైందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ ఇళ్లస్థలాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నల్లమడ వాగు ముంపువల్ల చిలకలూరిపేట ప్రాంతంలో ఏటా లక్ష ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లుతోందన్నారు. తక్షణమే ముంపు నివారణకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, ఇందుకు 300 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలో రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న 6 వేల కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలన్నారు. డెల్టా ప్రాంతంలో దళితులకు శ్మశాన స్థలాలు లేవని, ఉన్నచోట ఆక్రమణలకు గురయ్యాయని, ప్రతి గ్రామానికి 2 ఎకరాల శ్మశాన స్థలాన్ని కేటాయించాలని అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడుతూ సాగర్ ఆయకట్టుకు నీరు లేక జిల్లాలో పది మండలాల్లో వరినాట్లు వేయలేదని, సాగర్‌లో నీరు ఉన్నా విడుదల చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తొలుత నగరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ప్రదర్శనగా వెళ్లి జెసి క్రితికాశుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జొన్నా శివశంకర్, వై రాధాకృష్ణ, వెంకటరెడ్డి, కృష్ణమోహన్, ఈమని అప్పారావు, బి శ్రీనివాసరావు, కాళిదాసు, రమణ, ఆంజనేయులు నాయక్, కె రోశయ్య తదితరులు పాల్గొన్నారు.