గుంటూరు

పాతనేరస్థుల కదలికలపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 2: నగరంలో పాత నేరస్థుల కదలికలపై నిఘా వేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో అర్బన్ అధికారులతో నేరనియంత్రణకు అనుసరించాల్సిన పద్ధతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గతంలో శిక్షపడి బయటకు వచ్చి నగరంలో సంచరిస్తున్న నేరస్థుల రికార్డులను తిరగేయాలని సూచించారు. వారి జీవన శైలిపై సమాచారాన్ని సేకరించి నివేదిక రూపొందించాలన్నారు. సిసిటిఎన్‌ఎస్‌లో నమోదుకాని వివరాలను ఎంఒ క్రియాటెండ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి ముద్దాయిని అరెస్టుచేసే సమయంలో తగిన వివరాలు, అధారాలను తప్పనిసరిగా నమోదు చేయాలని వివరించారు. క్రైం అదనపు ఎస్పీ తిరుపాల్, డిఎస్‌పి మల్లికార్జునరావు, సిఐలు సమావేశానికి హాజరయ్యారు.