గుంటూరు

జగన్ చిలకజోస్యం చెప్పుకోవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 2..బంగారంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందికాదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. శుక్రవారం రోడ్లు, భవనాలశాఖ అతిథిగృహంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దుతోనే ప్రజలు అవస్థలు పడుతుంటే పులిమీద పుట్రలా మరో అస్త్రాన్ని సంధించడం భావ్యం కాదన్నారు. బంగారంపై కేంద్రం తీరు తేనెతుట్టపై రాయివేసిన చందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నందున దీనిపై పునరాలోచించాలని కోరారు. నోట్ల రద్దు సమస్యల పరిష్కారం కోసం సిఎం చంద్రబాబు కేంద్రంతో నిరంతరం సంప్రతింపులు జరుపుతున్నారని తెలిపారు. నోట్ల రద్దుతో ఉలిక్కిపడిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయారని విమర్శించారు. అభివృద్ధికి సైంథవుడిలా అడ్డుపడుతున్న జగన్ ప్రతిపక్ష నేతగా అనర్హుడన్నారు. ఉన్న కొద్దిపాటి మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్తే జగన్‌కు ఇక చెట్టుకింద చిలకజోస్యమే శరణ్యమని ఎద్దేవ చేశారు. రాజధానితో పాటు అభివృద్ధికి భూములిచ్చేందుకు రైతులు ముందుకు వస్తుంటే జగన్ వారిని రెచ్చకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విధ్వేషాలను రెచ్చకొడుతూ అధికారమే పరమావధిగా జగన్ నీఛ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు నిర్ణయంతో ఎదురవుతున్న ఇబ్బందులు తాత్కాలికమేనని ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగమందులు, ఎరువుల విక్రయాలపై నిఘాను తీవ్రతరం చేశామని చెప్పారు. రైతులను వంచించే వారిని వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కల్తీకారం, నకిలీ విత్తనాల విక్రేతలపై క్రిమినల్ కేసులు నమోదుచేసి జైలుకు పంపడం ఖాయమన్నారు.