గుంటూరు

జిల్లాలో 37 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 2: రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఈ నెల 14వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ క్రితికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పౌరసరఫరాలశాఖ అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. మిల్లర్లు, అధికారులతో చర్చించిన అనంతరం 37 కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటి వరకు లక్షా 16వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని అంచనా వేశారు. ఈ సందర్భంగా కేంద్రాల ఏర్పాటుపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యంలో తేమ శాతాన్ని పరిగణనలోకి తీసుకుని కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలని సూచించారు. నిత్యం కొనుగోళ్ల వివరాలు, ధాన్యం ఎంత వచ్చిందనే విషయాలను జిల్లా కార్యాలయానికి తెలియజేయాలన్నారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు, వెలుగు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాయని చెప్పారు. ధాన్యం తీసుకువచ్చిన రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరపాలని ఆదేశించారు. ఎ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు 1, 510, సాధారణ రకానికి 1, 470 వంతున ప్రభుత్వ కనీస మద్దతుధర నిర్ణయించిందని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు 45 రోజులు పనిచేయాలని సేకరణను బట్టి కొనసాగించే విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి చిట్టిబాబు, మేనేజర్ మంజుభార్గవి, జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షులు భాస్కరరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, వెలుగు, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు.