గుంటూరు

ఆధ్యాత్మిక గ్రంథాల అధ్యయనంతో సంపూర్ణ జీవన వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 18: సర్వజన శ్రేయస్సే తమ లక్ష్యంగా ఎంచుకుని, తమ తపోజ్ఞానశక్తిని అందరికీ అందించిన మన వేదాంత వేత్తలు రచించిన ఆధ్యాత్మిక గ్రంథాలను నిత్యం అధ్యయనం చేస్తే జీవన సంపూర్ణ వికాసానికి దోహదపడతాయని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఆదివారం నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రామచంద్రపుర అగ్రహారం శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థాన సమావేశ మందిర వేదికపై ప్రసిద్ధ కవి, సాహితీవేత్త మొవ్వ వృషాద్రిపతి రచించిన విదురనీతి సారము (గద్యం) గ్రంథావిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ విప్ లింగంశెట్టి ఈశ్వరరావు అధ్యక్షత వహించారు. మన గ్రంథాలన్నీ ఉదాత్తమైన లక్ష్యంతోనే మనకు సామాజిక చైతన్యాన్ని కల్గించే ఆలోచనతో రచించారని రోశయ్య చెప్పారు. ప్రధానంగా మహాభారత గ్రంథం చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుందన్నారు. సుప్రసిద్ధ సాహితీవేత్త వృషాద్రిపతి సర్వసతీపుత్రుడని, తిక్కన సోమయాజి ఆంధ్రీకరించిన భారతంలోని పద్యాలకు గద్యరూపంలో వ్యాఖ్యాన సహితంగా సుమధురంగా అందించారని ప్రశంసించారు. ఇలాంటి ఉత్తమ పుస్తక ప్రచురణకు ఇతోధిక సహాయ సహకారాలు అందించిన మిత్రుడు లింగంశెట్టి ఈశ్వరరావు, కొప్పరపు రాధాకృష్ణమూర్తి, ఇతర దాతలందరినీ రోశయ్య అభినందించి సత్కరించారు. శ్రీనాథపీఠ సంచాలకుడు పిఎస్‌ఆర్ ఆంజనేయప్రసాద్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఉన్న లబ్దప్రతిష్ఠులైన సాహితీవేత్తల్లో వృషాద్రిపతి తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటూ అగ్రస్థానంలో ఉన్నారన్నారు. అనంత విజ్ఞాన సారాంశమైన మహాభారతంలోని విదురుడు చెప్పిన నీతివాక్యాలను ప్రధానాంశాలుగా చేసుకుని మూడో పర్యాయం కూడా విదురనీతి సారము పుస్తకాన్ని ప్రచురించటం ఆనందదాయకమన్నారు. లింగంశెట్టి మాట్లాడుతూ సామాజిక జాగృతికి వేలకొలది సంవత్సరాలనాడే నాంది పలికిన మహాభారత గ్రంథాన్ని, అలాగే ఈ గ్రంథంలో సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు మెచ్చిన విదురనీతి తత్వాన్ని రచయిత వృషాద్రిపతి ఎంచుకుని పుస్తకరూపంలో అందించడం, ఈ పుణ్య కార్యక్రమంలో తామంతా భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పలువురు దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించామని, వారందరికీ సభాముఖంగా ఈశ్వరరావు, రాధాకృష్ణమూర్తి ధన్యవాదాలు తెలిపారు. సభలో బిజినేపల్లి రాధాకృష్ణమూర్తి, మంగళగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ సంకా బాలాజీగుప్తా, తిరుప్పావై ప్రవచనాల కర్త గొడవర్తి వెంకటేశ్వర్లు, ఇతర సాహితీవేత్తలు పాల్గొన్నారు.

అందరూ గర్వపడేలా టిఎన్‌యుఎస్ పనిచేయాలి
* ఎమ్మెల్సీ వివివి చౌదరి
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 18: రాష్ట్రం గర్వించేలా, ఉపాధ్యాయులు తలెత్తుకు తిరిగేలా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఎమ్మెల్సీ వివివి చౌదరి అన్నారు. ఆదివారం రాష్ట్ర టిడిపి కార్యాలయంలో జరిగిన టిఎన్‌యుఎస్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములయ్యేలా కార్యకలాపాలు సాగించాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకునేది ఉపాధ్యాయుల సంక్షేమమేనని, ఆయన పనితీరుకు తగినట్లుగా సంఘం కూడా కృషిచేయాలన్నారు. ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా లెక్కచేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయులకు అన్నివిధాలా న్యాయం చేస్తున్నారన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రధానంగా విద్యాశాఖకు ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. మానవ వనరుల శాఖకు 21,500 కోట్ల బడ్జెట్‌లో విద్యాశాఖకు 17,500 కోట్లు కేటాయించారన్నారు. పిఆర్‌సి ఫిట్‌మెంట్ వంటి అనేక సౌకర్యాలు కల్పించారన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులను, స్కూల్ అసిస్టెంట్లను రెగ్యులైజ్ చేశారని తెలిపారు. మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసేది ఉపాధ్యాయులేనని, వారు స్వార్థపూరితంగా వ్యవహరించకుండా సమాజ హితం కోసం కృషిచేయాలని కోరారు. టిడిపి పురోగతి కోసం నిబద్ధతతో పనిచేసే వారికి పార్టీ అండగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.