గుంటూరు

కదం తొక్కిన కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 23: శ్రమను దోచుకున్న జూట్‌మిల్లు యాజమాన్యం కార్మికుల జీవితాలను రోడ్డున పడేసింది. కార్మికుల వెన్నంటే ఉంటానన్న ప్రభుత్వం యాజమాన్యంతో కలిసి వెన్నుపోటును ప్రోత్సహిస్తుందని జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం జూట్‌మిల్లు కార్మికులతో కలిసి పరిరక్షణ సమితి సభ్యులు కార్మిక శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో జూట్‌మిల్లు యాజమాన్యం, ప్రభుత్వం కలిసి ఎన్నడూ లేనిరీతిలో కార్మికుల కళ్లెదుటే అన్యాయం చేసేందుకు సిద్ధపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా జూట్‌మిల్లు అక్రమ లాకౌట్‌పై జరుగుతున్న కార్మికుల న్యాయ పోరాటానికి కనీస న్యాయం చేయాలన్న ఆలోచన అధికార, పాలక యంత్రాంగానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ అనుమతి లేకపోయినా కార్మికశాఖకు సమాచారం ఇవ్వకుండా, కార్మిక సంఘాలకు తెలపకుండా మిల్లును మూసివేసేందుకు యాజమాన్యం సొంతంగా నిర్ణయం తీసుకుందన్నారు. కార్మికులకు అన్యాయంగా చెక్కులు పంపిణీ చేసేందుకు సిద్ధపడితే, కళ్లుండి చూడలేని ప్రభుత్వం యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం జూట్‌మిల్లు కార్మికులు, పరిరక్షణ సమితి సభ్యులతో కలిసి ఏర్పాటు చేసే సమావేశంలో ప్రభుత్వంపై అమీతుమీ తేల్చుకునేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ ధర్నాలో సీపీఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఆయా పార్టీల నాయకులు గులాం రసూల్, బాబు, నూకరాజు, కార్మికులు పాల్గొన్నారు.

వైసీపీ గుర్తింపు రద్దుచేయాలి
* టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు
గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 23: దేశ, విదేశాల్లో అక్రమాస్తులు కల్గిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి వంటి అవినీతి నాయకులు రాజకీయాల్లో ఉండతగరని, వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వైసీపీతో పాటు ఆ పార్టీకి కేటాయించిన గుర్తింపును రద్దుచేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. శక్రవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అవినీతి సంపాదన రాష్ట్రాలు, దేశాల సరిహద్దులు దాటి ప్రపంచ స్థాయికి చేరిందని విమర్శించారు. అక్రమాస్తుల కోసం దేశ ప్రతిష్ఠను మంటగల్పిన ఆయనకు ఇకపై రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదన్నారు. ప్రధానికి సైతం అపవాదు ఆపాదించిన జగన్ వ్యవహారశైలి ప్రధాని నరేంద్రమోదీ గుర్తించాలన్నారు. జగన్ అవినీతి కేసులో ప్రధానితో పాటు, నలుగురు కేంద్రమంత్రులకు కూడా నోటీసులు అందడం చూస్తే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధం చేసుకోవచ్చన్నారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్ రాష్ట్భ్రావృద్ధికై నిబద్ధతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అవహేళన చేస్తూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి అవినీతితో పాటు అధికారులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జగన్, విజయసాయిరెడ్డి జైలులో ఉండాలి గానీ ప్రజల మధ్య కాదన్నారు. విభజన చట్టంతో పాటు ప్రతి ఒక్క హామీని ప్రత్యేక హోదాతో సహా కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేయాల్సిందేనని విజ్ఞప్తిచేశారు. ఇతర రాష్ట్రాలకు హోదా ఇస్తున్నప్పుడు ఏపీకి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అన్యాయం చేస్తే బీజేపీ మరోసారి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఆ పార్టీ నేతలపై ఉందన్నారు.