గుంటూరు

తెలుగుదేశంతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదకూరపాడు, జూన్ 8: ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న తెలుగుదేశంతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీ్ధర్ పేర్కొన్నారు. పెదకూరపాడులోని శ్రీ సాయి శ్రీనివాస కళ్యాణ మండపంలో శుక్రవారం నవ నిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమం జరిగింది. అతిథిగా పాల్గొన్న శ్రీ్ధర్ మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్రం పూర్తిగా లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ మండలంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, అర్హులైన వారికి పింఛన్లు, పేదలకు పక్కా గృహాల నిర్మాణం ఇతర వౌలిక వసతులను కల్పించడం జరిగిందన్నారు. స్థానిక టీడీపీ సీనియర్ నేత జాగర్లమూడి రఘు గృహంలో కార్యకర్తలు, నేతలతో మాట్లాడిన అనంతరం గ్రామంలో అందరినీ పలుకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత పరస గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేశారు.

సంఘ సేవకుడు గుమ్మడి ఇకలేరు
* విభిన్నరంగాల ప్రముఖుల ఘననివాళి
గుంటూరు (కల్చరల్), జూన్ 8: ఒకప్పుడు పూర్తిగా కొండరాళ్లతో నిండివున్న ప్రాంతంలో నెలల తరబడి శ్రమించి, ఈ రోజున ఆ ప్రాంతాన్ని పూర్తిగా నవీన, అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్ది, గుంటూరు తిరుపతిగా బృందావన వెంకన్న ఆలయానికి పేరు, ప్రతిష్టలు తెచ్చిపెట్టడంలో తన సర్వశక్తులను ధారపోసిన గుమ్మడి రాధాకృష్ణమూర్తి (70) శుక్రవారం కన్నుమూశారు. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో సతమతమవుతున్న రాధాకృష్ణమూర్తి ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. బృందావన వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ కార్యదర్శిగా విలక్షణమైన రీతిలో సేవలు అందించారు. అంతేకాకుండా స్తంభాల గరువులో మహాప్రస్థానాన్ని ఏర్పాటు చేయడంలో కీలకమైన భూమికను పోషించి మహాప్రస్థానం సేవాసమితి కార్యదర్శిగా ఆ ప్రస్థానాన్ని మరుభూమిగా కాకుండా ఓ ఉద్యానవనంలా తీర్చిదిద్దారు. సంఘానికి ఆయా రంగాల్లో విశిష్ఠ సేవలందిస్తున్న వ్యక్తులను ప్రతి ఏటా సమాదరించాలనే ఆశయంతో స్వధర్మ సేవాసంస్థను ఏర్పాటుచేసి ధర్మజ్యోతి పురస్కారాలను అందజేశారు. వెలకట్టలేని సేవలందించిన గుమ్మడి రాధాకృష్ణమూర్తి అస్తమించడం పట్ల విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని, ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. రాధాకృష్ణమూర్తి నివాస గృహానికి నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, వెంకన్న ఆలయ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సభ్యులు, శంకరకంటి ఆసుపత్రి వైద్య బృందం తరలివెళ్లి ఆయన పార్థీవదేహాన్ని సందర్శించి పుష్పాంజలి సమర్పించారు. తాను మృతిచెందిన వెంటనే తన నేత్రాలను శంకర నేత్రాలయానికి అందించాలని ఆయన కోరుకోవడంతో ఆ ఆసుపత్రి వైద్యులు వెనువెంటనే ఆయన నేత్రాలను దానంగా స్వీకరించారు. శనివారం ఉదయం 10 గంటలకు మహాప్రస్థానంలో గుమ్మడి పార్థివదేహానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.