గుంటూరు

కంచె ఐలయ్యను అరెస్ట్‌చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మే 17: బ్రాహ్మణులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి వారి మనోభావాలు దెబ్బతీసిన ప్రొఫెసర్ కంచె ఐలయ్యను అరెస్ట్ చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి సిరిపురపు శ్రీ్ధర్ శర్మ, సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక పాతబస్టాండ్‌లోని జాలయ్య విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఐలయ్య దిష్టిబొమ్మను దగ్ధంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధ్యతా యువతమైన వృత్తిలో పనిచేస్తున్న ఐలయ్య గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. భారతదేశ నిర్మాణం కోసం, స్వాతంత్య్ర ఉద్యమంలోనూ బ్రాహ్మణులు ఎన్నో త్యాగాలు, ఆత్మ బలిదానాలతో పాటు ఆస్తులు కోల్పోయారన్నారు. అటువంటి వారిని దేశం కోసం ఏం చేశారంటూ ఐలయ్య ప్రశ్నించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంద్యాల రామలింగేశ్వరశాస్ర్తీ, తుళ్లూరు ప్రకాష్, ఐతి వాసుదేవశర్మ, కోనంకి మారుతి, నేపాక పద్మావతి, అంబికా ప్రసాద్ పాల్గొన్నారు.