గుంటూరు

రోడ్డుకు అడ్డంగా చెట్టు కొమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, మే 17: విద్యుత్ తీగలకు అడ్డువస్తున్నాయని చెట్టుకొమ్మలను తొలగించే కార్యక్రమాన్ని విద్యుత్‌శాఖా అధికారులు మంగళవారం చేపట్టడంతో ఆయా ప్రాంత ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విద్యుత్ తీగలకు అడ్డుగా వచ్చిన చెట్ల కొమ్మలను నరికివేయమన్నారేకానీ, ఆనరికిన కొమ్మలను ఎక్కడ వేయాలో తమకు చెప్పలేదని, అందుకనే అక్కడే వదిలేసి వెళుతున్నామని సిబ్బంది తెలిపారు. ఎవరికైనా వంట చెరుకుగా ఉపయోగకరంగా వుంటే చెట్లకొమ్మలను తీసుకెళ్ళవచ్చునని అన్నారు. ఈ విధంగా అయా రోడ్లపై బాధ్యత లేకుండా వదిలేసిన చెట్లకొమ్మల ఫలితంగా బాటసారులకు, వాహన చోదకులకు ఇబ్బందికరంగా మారింది. రోడ్డు పక్కకైనా కొమ్మలను వేయాలిగానీ మరీ రోడ్డుమీదనే కొమ్మలను వేయడం ఏమిటని ఆయా ప్రాంతవాసులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీనితో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరాఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.