గుంటూరు

పంతాలు నెగ్గించుకున్నారు .. ప్రజలను విస్మరించారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మే 17: పార్లమెంటు సమావేశాల్లో పాలక, ప్రతిపక్షాలు ఎవరిపంతాలను వారు నెగ్గించుకునేందుకు ప్రజలను విస్మరించారని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంస్థ కార్యాలయంలో జరిగిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. చర్చా కార్యక్రమానికి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఆర్‌వి సింగరయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తగా పాల్గొన్న సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బిల్లా వేదయ్య మాట్లాడుతూ ప్రస్తుతం జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ఆమోదం మినహా చెప్పుకోదగ్గ బిల్లులేవీ ఆమోదానికి నోచుకోలేదన్నారు. విశ్రాంత ఇంజనీర్ ఘనశ్యామాచార్యులు మాట్లాడుతూ ఈ సారి అజెండాలో లేని అంశాలపై ఇరుపక్షాలు వాగ్వాదానికి దిగడం, గందరగోళం నెలకొల్పడం, చివరికి వాయిదా పడటం పదే పదే జరిగాయన్నారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక బిల్లుతో సహా ప్రభుత్వశాఖ పద్దులన్నింటినీ మొక్కుబడిగా ఆమోదించారని, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే బిల్లుల విషయంలో అధికార, ప్రతిపక్షాల తీరు ఒకేలా ఉందన్నారు. అత్యంత కీలకమైన జిఎస్‌టి బిల్లు కూడా ఆమోదం పొందలేదని, ఇందుకు ఇరుపక్షాల బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో సంస్థ సీనియర్ సభ్యులు పి వెంగయ్య, గుప్తా, చంద్రయ్య పాల్గొన్నారు.