గుంటూరు

సివిల్ సప్లైస్ హమాలీ కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మే 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టాక్ పాయింట్ల వద్ద పనిచేస్తున్న కార్మికులకు కూలిరేట్లు పెంచాలంటూ సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. కలెక్టరేట్ పరిపాలనా అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం, పంచదార గోధుమలు, నిత్యావసర సరుకులు, గోడౌన్లలో నిల్వలు చేయడానికి గోడౌన్ నుండి రేషన్‌షాపులకు సరఫరా చేయడానికి ఎగుమతి, దిగుమతి సమయంలో ఇస్తున్న కూలిరేట్లు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. హమాలీలకు పనిభారం పెరిగినప్పటికీ ఆ మేరకు కూలిరేట్లు పెంచలేదన్నారు. క్వింటాకు 12 రూపాయలుగా ఉన్న కూలిరేటును పెంచాలన్నారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చిన ఆంజనేయులు మాట్లాడుతూ స్టాక్ గోడౌన్ల వద్ద కార్మికులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించకుంటే హమాలీలు సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి జివి సురేష్, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు.