గుంటూరు

ప్రణాళికతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదకూరపాడు, మే 17: విద్యార్థులు తమ లక్ష్యసాధనకై ప్రణాళికతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. పెదకూరపాడులోని దివంగత ఎస్‌ఎం లాల్‌జాన్‌బాషా షాదీఖానాలో మంగళవారం అడ్వకేట్ షేక్ బాలిసైదా పర్యవేక్షణలో స్థానిక ముస్లిం డెవలప్‌మెంట్ సొసైటీ వారిచే కెరీర్ గైడెన్స్ అవగాహనపై సదస్సు జరిగింది. సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు వారి అభీష్టం మేరకే విద్యా కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ముస్లింలు 9 శాతంగా ఉన్నప్పటికీ విద్యా, ఉపాధి రంగాల్లో ఉన్నత స్థాయిలో ఒక్క శాతంగా మాత్రమే ఉన్నారని, ముస్లిం డెవలప్‌మెంట్ సొసైటీ వంటివి ఏర్పాటుచేసి విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముస్లిం డెవలప్‌మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు మునీర్ అహ్మద్ మాట్లాడుతూ విద్యాభివృద్ధిపై వివక్ష లేకుండా విద్యను అందించాలన్నారు. తొలుత సదస్సులో కెరీర్ గైడెన్స్ పుస్తకాలను విడుదల చేసి పంపిణీ చేశారు. 2016 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావును ఘనంగా సన్మానించి ఖురాన్ గ్రంథాన్ని అందజేశారు. సదస్సులో రామగోపాలరావు, జెడ్పీటీసీ షరీఫ్, ఎం పోలురాజు, ఎంఇఒ చంద్రశేఖరరావు, ఆర్టీసీ ఉద్యోగి మస్తాన్‌వలి, వౌలానా ముఫ్తార్ అలీ, మహ్మద్ యూనస్, శీలంనేని సాంబశివరావు ప్రసంగించారు.