గుంటూరు

ఉపాధ్యాయులకు ప్రభుత్వ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మే 17: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ - ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై జిల్లా విద్యాసదస్సు టిఎన్‌యుఎస్ రాష్ట్ర కన్వీనర్ ఎ మోహనరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో ఆర్థికలోటు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని, పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచిందన్నారు. నేటి యువతకు కూడా సృజనాత్మకమైన విద్యను ఉపాధ్యాయులు బోధించాలన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యులు ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం మన ఊరు మన బడి ద్వారా విద్యార్థులను అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేస్తుంటే రేషనలైజేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మవద్దన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ పాఠశాలలో అన్ని వౌలిక వసతుల కల్పనకు తమవంతు కృషిచేస్తామన్నారు. జిల్లావిద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. టిఎన్‌యుఎస్ రాష్ట్ర గౌరవ సలహాదారుడు సిహెచ్ సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, మద్దాళి గిరిధర్, టిఎన్‌యుఎస్ రాష్ట్ర నాయకులు జె రమేష్, కె రాంబాబు, రెడ్డి రమేష్, జిల్లా నాయకులు బి హైమారావు, నాగేశ్వరరావు, శేషగిరిరావు పాల్గొన్నారు.