గుంటూరు

సాధికారమిత్రలదే కీలకపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, సెప్టెంబర్ 21: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటుచేసి మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఏర్పాటుచేసిన సాధికారమిత్రల ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఆడవారు వంట గదికే పరిమితం కాకుండా సమాజంలో పురుషులతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని సాధికారమిత్రలను ఏర్పాటుచేసి వారు ఇంట్లో ఉండకుండా సమాజంలో వారు నివశించే ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై ప్రభుత్వపరంగా వారి సహకారాన్ని అందించే విధంగా తయారు చేశారని కొనియాడారు. సాధికారమిత్రలకు కూడా కొంత వేతనాన్ని ప్రకటించి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరుతున్నాయో, లేదో వీరి ద్వారా సంక్షిప్తంగా కొంత సమాచారాన్ని ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్యం చేయించుకున్న వారికి మంత్రి చేతుల మీదుగా 15 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, వైస్ చైర్మన్ నజీరున్నీసాబేగం, ముద్దన నాగేశ్వరరావు, మద్దిబోయిన శివ, మల్లిబాబు, మదన్మోహనరావు, నెల్లూరు సదాశివరావు, ఆలోకం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యడ్లపాడు మండలం లింగారావుపాలెం, ఉప్పరపాలెం గ్రామాలకు చెందిన 30 కుటుంబాల వారు మంత్రి పుల్లారావు సమక్షంలో వైసీపీని వీడి దేశం తీర్ధం పుచ్చుకున్నారు. వీరికి పుల్లారావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.