గుంటూరు

రైతుల అభివృద్ధే చంద్రబాబు ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట రూరల్, సెప్టెంబర్ 21: రాష్టవ్య్రాప్తంగా రైతులు పండించిన పంటలకు మంచి గిట్టుబాటు ధరలు వచ్చేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ నుండి అనేక ప్రాంతాల్లో కోల్డ్‌స్టోరేజీల నిర్వహణ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నియోజకవర్గ మార్కెట్‌యార్డు ఆవరణలో శుక్రవారం 5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న కోల్డ్‌స్టోరేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమమే ముఖ్య ఉద్దేశంగా పరిపాలన చేస్తూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేంతవరక కోల్డ్‌స్టోరేజీలలో పంటదిగుబడులను నిల్వ చేసుకునే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతులకు అనేక రకాల రాయితీలు ప్రకటించి రైతులు పేదరికం నుంచి అభివృద్ధి చెందేవిధంగా బడ్జెట్‌లో ప్రత్యేకమైన నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. నూతనంగా నిర్మించనున్న కోల్డ్‌స్టోరేజీ చిలకలూరిపేట నియోజకవర్గంలో రైతులందరికీ తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే విధంగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, తేళ్ల సుబ్బారావు, షేక్ కరిముల్లా, మదన్, నాగేశ్వరరావు, సత్యనారాయణ, సమ్మద్‌ఖాన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.