గుంటూరు

సమస్యల పరిష్కారంతోనే నగర సమగ్రాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 10: నగరంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ అన్నారు. నవంబర్ 27 నుండి ఈనెల 9వ తేదీ వరకు సీపీఐ నగర సమితి ఆధ్వర్యాన నగర సమగ్రాభివృద్ధి కోసం పోరుబాట పాదయాత్ర కార్యక్రమం జరిగింది. పోరుబాటులో భాగంగా వివిధ సమస్యలను నగర వాసులు తమ దృష్టికి తీసుకువచ్చారని జంగాల తెలిపారు. వీటి పరిష్కారం కోరుతూ సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. నగరవాసులు తమ తమ సమస్యలతో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. నగర కమిషనర్ బయటకు రావాలని, తమ సమస్యలను పరిష్కరించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వౌలిక వసతులు కల్పించాలని, అనేక సంవత్సరాలుగా అక్రమించుకుని నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు, ఇంటిపన్ను నీటికుళాయి ఇతర వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరు కార్పొరేషన్ స్థాయికి ఎదిగినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసుకు కూర్చున్నాయన్నారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని నిరవధికంగా ముట్టడిస్తామని స్పష్టంచేశారు. సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ నగరంలో కలుషితమైన నీరు తాగి 17 మంది మృతిచెందితే నగరపాలక సంస్థ అధికారులు కారణం ఏమిటో తెలుసుకోలేక పోయారని మండిపడ్డారు. అనంతరం నరగపాలక సంస్థ అదనపు కమిషనర్ రామచంద్రారెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆయన స్పందిస్తూ సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర నాయకులు నూతలపాటి చిన్న, సురేష్, శ్రీనురెడ్డి, పాపారావు, కుమార్‌నాయక్, మంగమ్మ, అమీర్‌వలి, చల్లా చిన్న ఆంజనేయులు, సుబ్బారావు, అరుణ్‌కుమార్, రావుల అంజిబాబు, చెవుల పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం
మంగళగిరి, డిసెంబర్ 10: క్రీడల వలన మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం లభిస్తుందని టీడీపీ నాయకుడు ఏనుగ కిషోర్ అన్నారు. మండల పరిధిలోని పెదవడ్లపూడిలో మూడురోజుల పాటు బీఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యాన జరిగిన కబడ్డీ పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ఆటల్లో పాల్గొనాలని, యువత క్రీడలతో పాటు చదువులోను రాణించాలని ఏనుగ కిషోర్ అన్నారు. ప్రథమస్థానంలో నిలిచిన మంగళగిరి జట్టుకు 5 వేల రూపాయల నగదు, షీల్డును , రెండోస్థానంలో నిలిచిన చీరాల జట్టుకు 3 వేల నగదు షీల్డును వేదికపై అందజేశారు. పోటీల్లో మొత్తం 20 టీంలు పాల్గొన్నాయి. జవ్వాది కిరణ్‌చంద్, యేళ్ల శివరామయ్య, సుఖమంచి గిరిబాబు, కూరపాటి అంబేద్కర్, గోవాడ రవి, నిర్వాహకులు ధనరాజు, శాంతికుమార్, కిరణ్, అజయ్ దేవగన్ తదితరులు పాల్గొన్నారు.

మానవ హక్కులకు రక్షణ కల్పించాలి
కాకుమాను, డిసెంబర్ 10: హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించి, సామాన్యులకు రక్షణ కల్పించినప్పుడే సమసమాజ నిర్మాణం జరుగుతుందని, ఉపాధ్యాయ ఎస్టీయు రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ గేరా మోహనరావు అన్నారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మండల విద్యావనరుల కేంద్రంలో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పాటించాలన్నారు. మానవ మనుగడకు సంరక్షణ హక్కు ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు వై భాస్కరరావు, కెఎఫ్ కెనడి, ఈపూరి శ్రీనివాస్, సీతారామాంజనేయులు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.