గుంటూరు

నేను కష్టపడతా.. ప్రతిఫలం పేదలకందిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 13: రాజధాని అభివృద్ధే లక్ష్యంగా తాను కష్టపడుతున్నానని, వచ్చే సంపదను పేద ప్రజలకే అందించి వారి సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం మండల పరిధిలోని వైకుంఠపురం వద్ద 2,129 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి జరిగిన భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అధ్యక్షత వహించారు. ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతానికి కొండవీటివాగు ముప్పు ఉండేదని, దీనిని నివారించగలిగామన్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధాని నిర్మాణానికి తాను పూనుకున్నానని, అందరూ తనకు సహకరించాలని కోరారు. వైకుంఠపురం బ్యారేజీ చుట్టూ ఔటర్, ఇన్నర్ రింగురోడ్డు ఉంటాయని, ఏ సిటీకీ లేనటువంటి అనేక వౌలిక సదుపాయాలు ఈ ప్రాంతంలో కల్పిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలుకు సహకరించకుండా ప్రధాని నరేంద్రమోదీ దొంగనాటకాలాడుతున్నారని, ప్రతిపక్ష నేత జగన్ కూడా వారికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. మోదీని ఇంటికి పంపేవరకు అందరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. మహిళలకు పసుపు- కుంకుమతో పాటు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 2 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత దేశంలోనే ఎక్కడా లేదన్నారు. వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాల రైతులు ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తామని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్, కలెక్టర్ శశిధర్‌ల ద్వారా తనకు తెలియపర్చారన్నారు. రైతులంతా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని ముఖ్యమంత్రి కోరగా సభకు విచ్చేసిన ప్రజలు, రైతులు హర్షామోదాలు తెలియజేశారు. రాజధాని అమరావతికి 140 నదులను అనుసంధానం చేసి వరల్డ్ క్లాస్ రాజధానిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కుల, మత, ప్రాంతీయ, రాజకీయాలకు అతీతంగా అందరికీ న్యాయం చేయడమే తన ఉద్దేశమని, 40 ఏళ్లుగా సామాజిక పోరాటం చేస్తున్న వ్యక్తి తానేనని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రతి రైతు కుటుంబానికి 10 వేల రూపాయలు వ్యవసాయ ఖర్చులు అందించేందుకు ఈరోజు క్యాబినెట్‌లో తీర్మానించినట్లు తెలిపారు. వైకుంఠపురం బ్రిడ్జిని పూర్తిచేశాక ఎన్‌టిఆర్ సాగర్‌గా తీర్చిదిద్దుతామన్నారు. చోడవరం బ్రిడ్జిని కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ముక్కామల సాంబ్రాజ్యం 1,01,116 రూపాయలు, జూపూడి మదర్‌థెరిస్సా మహిళా గ్రూపు తరపున అనంతనేని రమాదేవి లక్ష రూపాయలు, గణపతి మహిళా గ్రూపు తరపున నాగరాజ 60 వేలు, వైకుంఠపురం రైతు నూతలపాటి గణపతిరావు 50 వేల రూపాయలతో పాటు మరికొన్ని మహిళా సంఘాలు కలిసి సుమారు 9 లక్షల రూపాయల విరాళాలు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ దిగగానే దగ్గరలో ఉన్న భవఘ్ని ఆశ్రమానికి వెళ్లి భవఘ్ని గురువుల ఆశీర్వచనాలు అందుకున్నారు. కృష్ణానది తీరంలో నిర్మించిన భవఘ్ని ఆశ్రమాన్ని తిలకించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పీఠంలో భగవద్గీతను ఆచరించడం సంతోషకరమన్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ నాయకులు రాయపాటి రంగారావు, రాయపాటి శ్రీనివాస్, వెన్నా సాంబశివారెడ్డి, మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్, జీవీ ఆంజనేయులు, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, రూరల్ ఎస్‌పి రాజశేఖరబాబు తదితరులు పాల్గొన్నారు.