గుంటూరు

253 ఆక్రమణల తొలగింపు-133 కుటుంబాలకు స్లిప్‌లు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, జూలై 3: రహదారుల విస్తరణ ఫలితంగా ఇప్పటి వరకూ తాడేపల్లిలో మొత్తం 253 ఇళ్ళు తొలగించామని, ప్రత్యామ్నాయ భద్రత కోసం అర్హులైన 133 కుటుంబాలకు స్లిప్‌లు పంపిణీ చేశామని, మిగిలిన వారికి సైతం గూడు కల్పించటం కోసం తాడేపల్లిలో యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ బి శివారెడ్డి తెలిపారు. నిర్వాసితుల ప్రత్యామ్నాయ నివాస ఏర్పాటు కోసం పోలకంపాడులో ఎంపికచేసిన మూడు ఎకరాల స్థలం అభివృద్ధి విషయమై ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టర్‌లతో సమావేశం అయిన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ నుండి సీతానగరం రైల్వేబ్రిడ్జి వరకూ 180 ఇళ్ళు, బోటుయార్డు స్కూృబ్రిడ్జి నుండి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వరకూ 40 ఇళ్ళు, ఉండవల్లి సెంటర్ నుండి ఆంజనేయస్వామి గుడివైపు 20 ఇళ్ళు, 70 షాపులు, క్రిస్టియన్‌పేట ఏరియాలో 12 ఇళ్ళు, సాయిబాబాగుడి సమీపంలో 1 ఇల్లు తొలగించామని, ఇవిగాక కొద్ది రోజుల్లో ఎన్‌టిఆర్ కట్ట, ప్యారీ కంపెనీగేట్ తదితర ప్రాంతాల్లో మరో 50 ఇళ్ళు తొలగించాల్సి ఉందని తెలిపారు. ఈక్రమంలో సీతానగరం, కె ఎల్‌రావుకాలనీ ఏరియాలో 60 స్లిప్‌లు, స్కూృబ్రిడ్జి సమీపంలో 40 స్లిప్‌లు, చైర్‌పర్సన్ ఇంటి సమీపంలో 22 స్లిప్‌లు, క్రిస్టియన్‌పేట సమీపంలో 12 స్లిప్‌లు పంపిణీ చేశామని, వాటితో పాటు తొలగించాల్సిన ఇళ్ళకు సైతం విచారణచేసి స్లిప్‌లు సిద్ధం చేస్తున్నామన్నారు. కాగా ఇప్పటికే పుష్కరఘాట్‌ల వద్ద ఇళ్ళు కోల్పోయినవారికి ప్రత్యామ్నాయంగా బోటుయార్డు సమీపంలో సుమారు 80 సెంట్ల సమీపంలో 80మందికి ప్రత్యామ్నాయం ఇచ్చామని, వారికి మంచినీటి సౌకర్యం కోసం ఒకబోర్ పంపు వేశామని, పురుషులకు నాలుగు, మహిళలకు నాలుగు మరుగుదొడ్డు కట్టించామని, స్నానాల గదులు సైతం ఏర్పాటు చేస్తున్నామని, పైకప్పు, ప్లాస్టింగ్ చేయాల్సి ఉందన్నారు. వీరు నివసిస్తున్న ప్రాంతాల్లో విద్యుత్ అధికారులతో మాట్లాడి కరెంట్ పోల్ ఏర్పాటు చేస్తున్నామని, తొలగించిన ఇళ్లకు ఉన్న పాత మీటర్లు బిగించుకోవటానికి అనుమితిస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా మిగిలినవారికి కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్‌తో సంప్రదించి, ఉండవల్లి పరిధిలో భూసమీకరణకు ఇచ్చిన సుమారు 3 ఎకరాల స్థలంలో మెరకలు తోలిస్తున్నామని, పొక్లెయినర్‌తో తొలగించిన ఇళ్ళ మట్టి, రాళ్ళు ట్రాక్టర్‌ల ద్వారా తరలిస్తున్నామన్నారు. ఈక్రమంలో ఇక్కడ సుమారు 100 మందికి ప్లాట్‌లు విభజించి ఇస్తామని, మరికొందరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రకాష్‌నగర్‌లో శాశ్వత ప్రాతిపదికన నివాసాలు ఏర్పాటు చేయటానికి సర్వే జరుపుతున్నామన్నారు. ప్రభుత్వ నిభందనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రత్యామ్నాయం చూపిస్తామని ఆయన తెలిపారు. అంతేగాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తాడేపల్లిలో అర్హులైన పేదలకు ఇళ్ళు ఏర్పాటు చేసేందుకు సీతానగరంలోనూ, ప్రకాష్‌నగర్‌లోనూ, కొలనుకొండ సమీపంలోనూ ఇతర ప్రదేశాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించటం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బి శివారెడ్డి తెలిపారు.
నిర్వాసితులందరికీ ప్రత్యామ్నాయంపై
అధికారులు, అమాత్యుల హైడ్రామా!
అటు అధికారపక్ష ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు తాడేపల్లిలో ఇళ్ళు కోల్పోయిన నిర్వాసితులతో హైడ్రామా ఆడుతున్నారా? అన్నట్లు కనిపిస్తోంది. రానున్న పుష్కరాల పనుల నిమిత్తం జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా నివాసాలు కోల్పోయిన ప్రతి ఒక్కరకీ ప్రత్యామ్నాయం చూపాలని, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎంపి గల్లాజయ్‌దేవ్, మరికొందరు ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు సైతం ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఇళ్ళు ఇస్తుందని, భయపడొద్దని చెప్పుకొచ్చారు. ఈక్రమంలో అధికారులు చెప్పిన అధికారిక లెక్కల ఆధారంగా ఇప్పటి వరకూ 253 ఇళ్ళు తొలగించారు. అయితే ప్రత్యామ్నాయం ఏర్పాటు విషయంలో మాత్రం స్థానికతను పరిగణలోకి తీసుకుంటామని, అందుకు అవసరమైన విచారణ జరిపించి, నిజమైన అర్హులకు మాత్రమే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయటం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. అధికారులు నిబంధనలకు లోబడి పని చేయాల్సి ఉంటుందని, ప్రజాప్రతినిధుల ప్రతిమాట శాసనం కాదని, ఉన్న శాసనాలు, నిభందనలను అనుసరించి ప్రజలకు సేవలందించటమే తమ పని అని ఈ క్రమంలో నిజమైన లబ్ధిదారులను మాత్రమే ఎంపికచేసి ప్రత్యామ్నాయం ఇస్తామని, ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వటం సాధ్యంకాదని పరోక్షంగా చెపుతున్నారు. దీంతో నిర్వాసితులు, ప్రతిపక్ష నాయకులు అటు పాలకపక్ష నేతల మాటలనే వల్లెవేస్తూ అధికారుల చుట్టూ తిరుగుతుంటే, అధికారులు మాత్రం తమ నిబంధనలే మార్గదర్శకమని చెపుతూ హైడ్రామాను కొనసాగిస్తున్నారు. మరి ఏ విధంగా పరిష్కారం అవుతుందో వేచి చూడాల్సిందే.